మెల్‌బోర్న్ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వజ్ర సంకల్పంతో చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తుది అంకానికి చేరుకుంది. రేపటితో (జనవరి 9) జననేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగుస్తుండటంతో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ఆసీస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, నేమాని శర్మ,ఆదిత్య రెడ్డి, హరిబాబు చెన్నుపల్లి,రాజ్ దాసరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ ప్రతినిధులు పాల్గొని వైఎస్ జగన్ కి అభినందనలు తెలియజేసారు.
Comments
Please login to add a commentAdd a comment