ఓ వైపు తరలివచ్చిన లక్షలాది జనం.. మరో వైపుఅడుగడుగునా అభిమాన నేతకు ఆశీర్వచనం..ఎటు చూసినా ఉప్పొంగిన అభిమాన తరంగం.. ఇది2017 నవంబర్ 6వతేదీ నాటి దృశ్యానికి అక్షర రూపం.
మహానేత వైఎస్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిఆంధ్రరాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా సంకల్పధీరుడై..పాదయాత్రికుడై పుట్టిన గడ్డ నుంచి బయదేరిన సందర్భం.అలా మొదలైన తొలి అడుగు ఎండా.. వాన.. చలిని సైతంలెక్క చేయక నమ్మిన సిద్ధాంతం .. జన హితం కోసంఅలుపెరగకుండా కదిలింది. ఎన్నో సభలు.. మరెన్నోఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ.. సమస్యలు ఆలకిస్తూ..కష్టాలు తెలుసుకుంటూ.. కన్నీళ్లు తుడుస్తూ.. భరోసాకల్పిస్తూ జైత్ర యాత్రలా సాగిన ప్రజాసంకల్ప యాత్రమరుపురాని చరిత్రగా నిలిచి పోనుంది. ఆ అవిశ్రాంతయోధుడు జన దీవెనలతో రాజన్న రాజ్యం స్థాపిస్తాడని..సువర్ణయుగానికి నాంది పలుకుతాడని.. నవరత్నాల్లాంటిపథకాలతో తమ బతుకుల్లో వెలుగులు నింపుతాడనే ఆశ..ఆకాంక్ష.. ఆత్మవిశ్వాసం అందరిలో కనిపిస్తోంది.
సాక్షి ప్రతినిధి కడప: ఇడుపులపాయలో 2017 నవంబర్ 6న ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర 2019 జనవరి 9న దిగ్విజయంగా ముగింపు పలకనుంది. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా ఉంటూ.. ఆత్మబంధువుగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని విశ్లేషకులు కొనియాడుతున్నారు. సర్వం కోల్పోయి జీవితంలో ఏమీ లేదని నిరాశ చెందుతున్న బాధితులకు ప్రభుత్వం ఆసరాగా నిలివాల్సి ఉంది. ప్రభుత్వ చర్యలు నామమాత్రమే కావడంతో అలాంటి వారికి కొండంత ధైర్యం నింపుతూ.. బడుగు, బలహీన వర్గాల్లో.. నేనున్నానని.. మీకేం కాదని భరోసా కల్పిస్తూ ఎక్కడికక్కడ ముందుకు కదిలారు. కలిసిన ప్రతి ఒక్కరినీ కూడా అదే ఆప్యాయంగా పలుకరిస్తూ.. కష్టసుఖాలు తెలుసుకుంటూ అందరిలో ఒకడిలా ముందుకు కదిలారు. ఇంటి బిడ్డలా.. కష్టంలో ఇంటికి పెద్దన్నలా ఉంటానంటూ హామీ ఇçస్తూనే.. అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను దూరం చేసి రాజన్న రాజ్యంతో స్వర్ణయుగం అందిస్తానని నమ్మకం కల్పించారు.
అడుగడుగునా బ్రహ్మరథం
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రను తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ నుంచి ప్రారంభించారు. చలికాలం, ఎండకాలం, వానకాలంలో కొనసాగి మరుపురాని చరిత్రకు సజీవ సాక్ష్యమైంది. పాదయాత్ర ప్రారంభం నుంచి అపురూప ప్రజాదరణ లభించింది. ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనంతో దిగ్విజయంగా సాగింది. అడుగడుగునా ప్రతిపక్ష నేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పల్లె, పట్టణం తేడా లేకుండా.. చిన్నా పెద్ద తారమత్యం లేకుండా.. అడుగడుగునా జననేతను కలుస్తూ తమ కష్టసుఖాలు చెప్పుకుంటున్నారు. అంతే ఓపికగా వారి సమస్యలు వింటూ తన పరిధిలో అవకాశం మేరకు చేయూతనిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రజా విన్నపాలు.. ప్రభుత్వం తత్తరపాటు..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రజల విన్నపాలు అధికమయ్యాయి. ప్రభుత్వ డొల్లతనాన్ని ఎక్కడికక్కడ ప్రజలు ప్రతిపక్షనేత దృష్టికి తీసుకువస్తున్నారు. సమస్యలపై జననేత స్పందిస్తూ తక్షణమే హామీలు గుప్పించారు. ఈ క్రమంలోనే వేంపల్లెలోని దేవి కల్యాణ మండపంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఎస్సీ కాలనీలకు ఉచిత విద్యుత్ హామీ లభించింది. అత్యధిక బిల్లులొస్తున్నాయి.. కూలీకి వెళ్తేనే పొట్ట నింపుకొనే మాబాటోళ్లు.. ఎలా బతకాలి సార్... అంటూ ఎస్సీలు విన్నవించడంతో వెంటనే స్పందించిన జననేత ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
♦ వేంపల్లెలో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైస్కూల్ సమీపంలో టీచర్లు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. కాంట్రీబ్యూటరీ ఫెన్షన్ స్కీమ్ (సీపీఎస్) వల్ల ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోనున్నట్లు వివరించారు. జిల్లాలో 12 వేల మంది ఉపాధ్యాయులు సీపీఎస్ పరిధిలోకి వస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది ఉన్నారని వివరించారు. సర్వీసు అంతా ప్రజలతో మిళితమైన తమకు అన్యాయం చోటు చేసుకుంటోందని వారు విన్నవించడంతో.. అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు.
♦ గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా వీరపునాయునిపల్లె మండలంలోని సర్వరాయసాగర్ ప్రాజెక్టు పూర్తి కాలేదని రైతులు వివరించారు. అందుకు స్పందించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని, పెండింగ్‌లో ఉన్న సర్వరాయసాగర్ ప్రాజెక్టుతోపాటు సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించారు.
♦ జమ్మలమడుగు నియోజకవర్గంలోని బ్రహ్మణి ఉక్కు పరిశ్రమను ప్రభుత్వం రద్దు చేసింది. ఉపాధి కల్పన నిమిత్తం ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలని ఎర్రగుంట్లలో స్థానికులు కోరడంతో అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుడుతామని ప్రకటించారు.
♦ ఫిజియో థెరఫిస్టులకు ఉద్యోగ అవకాశాలు లేవని, కోర్సు పూర్తి చేసినా ఆశించిన ప్రయోజనం దక్కడం లేదని వివరించడంతో.. ఆరోగ్యశ్రీలో కీళ్లు మార్పిడి శస్త్ర చికిత్సను చేర్చి ఫిజియో «థెరపిస్టులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇచ్ఛాపురానికి తరలివెళ్లిన నేతలు
ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ముగింపు కార్యక్రమం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి జిల్లా నేతలు తరలి వెళ్లారు. రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, రాచమల్లు శివప్రసాదరెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ సుధీర్‌రెడ్డి, డాక్టర్ వెంకటసుబ్బయ్య, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి, మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డితోపాటు జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు తరలివెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment