
శ్రీకాకుళం: ఐదేళ్ల నా బిడ్డ దవళ సాగర్ బెహరా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్లం. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. నెలనెలా రూ.10 వేలు అప్పుగా వా డుకొని విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకువెళుతున్నాం. మూడేళ్లుగా వ్యాధి తో బాధపడుతున్న నా కొడుకును ఆదుకోవాలి.– సాగర్‌బెహరాతో తల్లిదండ్రులు దుర్యోధన, లక్ష్మి, కవిటి