
శ్రీకాకుళం: ‘అన్నా.. మీరు సీఎం అయిన తర్వాత మెగా డీఎస్సీ నిర్వహించాలి. టీడీపీ ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులను మోసం చేసింది. 23వేల పోస్టులుంటే 7వేల పోస్టులను మాత్రమే భర్తీ చేసి నిరుద్యోగులకు అన్యాయం చేసింది’ అని కవిటి మండలం కె.కొత్తూరుకు చెందిన బి.శ్రావణి జగన్‌కు తెలిపారు. వైఎస్ హయాంలో యాభై వేల పోస్టులు ఒకేసారి మంజూరు చేశారని, మీరు సీఎం అయ్యాక మెగా డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు.