
సాక్షి, విజయనగరం : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయనగరం పట్టణంలోకి విజయవంతంగా అడుగుపెట్టింది. వైఎస్ జగన్ రాకతో విజయనగరం పట్టణం జన సునామీలా మారింది. తమ అభిమాన నాయకుడిని చూడడానికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రజల రాకతో ఎత్తు బ్రిడ్జి, రేల్వే స్టేషన్, వైఎస్సార్ జంక్షన్, ఎన్‌సీ యస్ ధియేటర్ జంక్షన్, కన్యకాపరమేశ్వరి టెంపుల్, కోళ్ల బజారు, మెయిన్ మార్కెట్ నుంచి మూడు లాంతర్ల జంక్షన్ వరకు భారీగా జనం పోటెత్తారు. వైఎస్ జగన్‌కు అపూర్వ స్వాగతం పలుకుతూ రెండు కిలోమీటర్ల మేర జనాలు బారులు తీశారు. మూడు లాంతర్లు జంక్షన్‌లో వైఎస్ జగన్ బహిరంగ సభ జరగనుంది.