‘అబద్ధాలు తప్ప.. ఆయన చేసిందేమీలేదు’ | Minister Vellampalli Srinivas Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లు 

Published Fri, Feb 5 2021 1:18 PM | Last Updated on Fri, Feb 5 2021 1:20 PM

Minister Vellampalli Srinivas Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయనగరం: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అబద్ధాలు తప్ప.. అభివృద్ధి చేసిందేమీలేదని దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్‌ దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతి అంటూ చంద్రబాబు పదేపదే చెప్పారని, కానీ ఎక్కడా అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. కరోనా సమయంలో కూడా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్విరామంగా సాగాయని తెలిపారు. (చదవండి: దేవాలయాలు కూల్చిన చరిత్ర టీడీపీ, బీజేపీలది..)

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే మంచి ఆలోచనతో వైఎస్‌ జగన్‌.. మూడు రాజధానులు ఏర్పాటుకు పూనుకున్నారని తెలిపారు. చంద్రబాబు.. కోర్టుకెళ్లి ప్రజల సంక్షేమానికి అడ్డుపడుతూనే ఉంటారని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సాగుతున్నాయని, కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే అమ్మ ఒడి, ఇళ్ల పట్టాల పంపిణి వంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.(చదవండి: టీడీపీ దౌర్జన్యం.. కర్రలతో దాడి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement