
సాక్షి, విజయనగరం: కరోనా బారినపడి సీసీఎస్ డీఎస్పీ జె.పాపారావు మృతి చెందారు. విశాఖలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. శ్రీకాకుళం జిల్లా సారవకోటకు చెందిన పాపారావు.. ఎస్ఐ స్థాయి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా సిసిఎస్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 7,224 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు కోవిడ్ కారణంగా 15 మంది మృతిచెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు మరణించారు.
చదవండి:
గుంటూరులో దారుణం: వృద్ధురాలిపై లైంగిక దాడి
దారుణం: కామంతో కళ్లు మూసుకుపోయి..
Comments
Please login to add a commentAdd a comment