ccs dsp
-
కరోనా బారిన పడి డీఎస్పీ మృతి
సాక్షి, విజయనగరం: కరోనా బారినపడి సీసీఎస్ డీఎస్పీ జె.పాపారావు మృతి చెందారు. విశాఖలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. శ్రీకాకుళం జిల్లా సారవకోటకు చెందిన పాపారావు.. ఎస్ఐ స్థాయి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా సిసిఎస్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 7,224 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు కోవిడ్ కారణంగా 15 మంది మృతిచెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు మరణించారు. చదవండి: గుంటూరులో దారుణం: వృద్ధురాలిపై లైంగిక దాడి దారుణం: కామంతో కళ్లు మూసుకుపోయి.. -
తక్కువ ఫీజుకే విదేశాల్లో మెడిసిన్ సీట్లు అంటూ...
సాక్షి, హైదరాబాద్: తక్కువ ఫీజుకే విదేశాల్లో మెడిసిన్ సీటు ఇపిస్తానని వందల మంది విద్యార్థుల నుంచి కోట్లు రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు... ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా వీకోట మండలం పాముగాని గ్రామానికి చెందిన కిషన్‌రెడ్డి గత పది సంవత్సరాల నుంచి దిల్‌సుఖ్‌నగర్‌లో ఇగ్గి మల్టీసర్వీస్ పేరుతో ఫిలిప్పీన్స్ లోని సీడీయూ యూనివర్సిటీలలో మెడిసిన్ సీటు ఇప్పిస్తానని విద్యార్థుల నుంచి 30 లక్షల రూపాయలు వరకు వసూలు చేశాడు. ముందుగా లక్ష రూపాయలు విద్యార్థు నుంచి వసూలు చేసి యూనివర్సిటీకు కట్టి అడ్మిషన్లు ఇప్పిస్తాడు. తాము ఫీజు కట్టినా కట్టలేదని యూనివర్సిటీల నుంచి ఫోన్లు రావడంతో కిషన్‌రెడ్డిని విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. తాము చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వాలని కోరారు. డబ్బులు వెనక్కి ఇచ్చేది లేదు ఎవరికీ చెప్పకుంటారో చెప్పుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ పిల్లల చదువులకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు అతడి వద్ద ఉండటంతో ఏం చేయాలో పాలుపోక విద్యార్థుల తల్లిదండ్రులు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి తప్పించుకుని తిరుగుతున్న కిషన్‌రెడ్డిని వారం రోజుల క్రితం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తమ పిల్లల ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ అతని వద్దే ఉన్నాయని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తమకు ఇప్పించాలని డీసీపీని తల్లిదండ్రులు కోరారు. తమ పిల్లలకు జరిగిన అన్యాయాన్ని మరెవరికి జరగకుండా అతడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మెడిసన్ సీట్ల పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు చేసి స్థిరాస్తులు కూడబెట్టుకున్న వాటిని జప్తు చేసి నష్టపోయిన వారికి ఇవ్వాలని పోలీసులకు విన్నవించుకున్నారు. -
సీసీఎస్ డీఎస్పీ బాధ్యతల స్వీకరణ
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు సెం ట్రల్ క్రైమ్ స్టేషన్ డీఎస్పీగా ఎం. బాలసుందరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1991 బ్యాచ్‌కు చెం దిన బాలసుందరం ఎస్ ఐ, సీఐగా ప్రకాశం, నెల్లూరు జిల్లా సీసీఎస్‌లో పనిచే శారు. 2014 నవంబర్‌లో సీసీఎస్‌లో పనిచేస్తోన్న సమయంలో ఆయనకు డీఎస్పీ పదోన్నతి లభించిం ది. అప్పటి నుంచి ఆయన ప్రకా శం జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్–1 డీఎస్పీగా పనిచేశారు. ఈ నెల 15వతేదీన జరిగిన బదిలీల్లో నెల్లూరు సీసీఎస్ డీఎస్పీగా నియమితులయ్యారు. బాధ్యలు స్వీకరించిన ఆయనకు సీసీఎస్ ఇన్స్పెక్టర్లు బాజీజాన్‌సైదా, రామకృష్ణారెడ్డి, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం ఎస్పీ విశాల్‌గున్నీ, ఏఎస్పీ బి.శరత్‌బాబులను మర్యాదపూర్వకంగా కలిశారు.