విజయనగరం జిల్లాలో టీడీపీకి షాక్‌.. | TDP Ex Minister Padala Aruna Resigns | Sakshi
Sakshi News home page

టీడీపీకి మాజీ మంత్రి పడాల అరుణ రాజీనామా

Published Sat, Jan 30 2021 11:45 AM | Last Updated on Sat, Jan 30 2021 2:10 PM

TDP Ex Minister Padala Aruna Resigns - Sakshi

సాక్షి, విజయనగరం: జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఉత్తరాంధ్ర టీడీపీలో  కీలక మహిళానేతగా పేరొందిన ఆ పార్టీ జిల్లా సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి పడాల అరుణ.. పార్టీకి గుడ్‌బై చెప్పారు. రాజీనామా ప్రతాన్ని పార్టీ అధ్యక్షుడికి పంపారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పడాల అరుణ పనిచేశారు. చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ నయా కుయుక్తులు..

33 ఏళ్లుగా టీడీపీలో పనిచేసినా, పావుగా వాడుకున్నారే తప్ప.. సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఇమడలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పడాల అరుణ తెలిపారు. అటు అధిష్టానం, ఇటు జిల్లా పార్టీ పెద్దలు కనీసం ప్రాధాన్యత ఇవ్వకపోవడం, రాష్ట్ర కమిటిలలో సైతం చోటు కల్పించకపోవడం వంటి కారణాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్న అరుణ.. టీడీపీకి గుడ్‌బై చెప్పారు. చదవండి: మేనిఫెస్టో పేరిట మరో మోసమా చంద్రబాబూ.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement