padala aruna
-
టీడీపీలో రాజీనామాల పర్వం..
టీడీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ జిల్లాలోని కీలక నేతలు పార్టీని వీడుతుండడంతో కార్యకర్తలు, నాయకుల్లో నైరాశ్యం ఆవహించింది. ఇప్పటికే ప్రాభవం కోల్పోయిన పార్టీలో కొనసాగాలా.. వద్దా అన్న సందిగ్ధం నెలకుంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశం పార్టీకి జిల్లాలో గడ్డు పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో ప్రజాదరణ కోల్పోయిన పార్టీ ప్రతిష్ట క్రమక్రమంగా క్షీణిస్తోంది. అవసరం తీరిన తరువాత తన, మన అనే తేడా లేకుండా... సీనియర్లనే కనీస గౌరవం లేకుండా పూచిక పుల్లను వాడిప డేసినట్లు పక్కన పడేయడం ఆ పార్టీ అధినేతల సంప్రదాయం. దశాబ్దాలుగా అక్కడ అదే జరుగుతోంది. దీనిని జీర్ణీంచుకోలేని కొందరు సీనియర్లు పార్టీని వీడుతున్నారు. మరికొందరు పార్టీలోనే ఉంటూ తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి పడాల అరుణ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. చదవండి: టీడీపీకి అభ్యర్థులు కరువు.. బాబు హైరానా.. గజపతినగరంలోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల 1985లో రాజకీయ రంగ ప్రవేశం చేశానని, ఎన్నో పదవులు చేపట్టి ప్రజలకు ఎంతో సేవ చేశానని, కానీ వాటిని ఈ రోజు తెలుగు దేశం పార్టీ కనీసం గుర్తించక పోవడం వల్లనే రాజీనామా చేస్తున్నానని అరుణ వివరించారు. మూడు దశాబ్దాలుగా ఆమెకు టీడీపీతో అనుబంధం ఉంది. చదవండి: పంచాయతీ ఎన్నికలు: టీడీపీ నేతల బరితెగింపు.. 1987లో బొండపల్లి మండల అధ్యక్షురాలిగా, 1989, 1994లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1996లో మంత్రి పదవి చేపట్టారు. 1999 నుంచి చాలా పదవులు నిర్వహించారు. అంతటి క్రియాశీలకంగా ఉండే పడాల అరుణకు 2013 నుంచి పారీ్టలో ప్రాధాన్యం తగ్గడం మొదలైంది. ‘‘పార్టీ కోసం అంకిత భావంతో పని చేసిన నన్ను రోజురోజుకు గుర్తింపు లేనివిధంగా చేశారు’’... అంటూ ఆమె విలేకరుల ఎదుట కన్నీటిపర్యంతమవ్వడం టీడీపీలో సీనియర్లు, పారీ్టకి కట్టుబడి ఉన్నవారి పరిస్థితికి అద్ధం పట్టింది. అందిరిదీ అదే వేదన... ఒక్క అరుణకే ఈ పరిస్థితి కాదు. జిల్లాలో అనేక మంది టీడీపీ నాయకులు, సీనియర్ల పరిస్థితి కూడా ఇదే. మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావును కూడా ఇదే విధంగా పార్టీని వీడేలా చేశారు. ఆయన కూడా చాలా కాలం పాటు టీడీపీకి సేవచేసి, చివరికి తనకు పారీ్టలో కనీస గుర్తింపు లేదని మదనపడి రాజీనామా చేసి ఇటీవలే బయటకు వచ్చేశారు. ఆ తరువాత మరో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తిరుగుబావుటా ఎగురవేశారు. ఆమెకు ఇంకో ఎమ్మెలే కె.ఎ.నాయుడు జతకలిశారు. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్ష పదవిని జూనియర్ అయిన కిమిడి నాగార్జునకు ఇవ్వడాన్ని నిరసిస్తూ గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కె.ఎ. నాయుడు తానే వేరుగా విజయనగరం పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేశారు. ఆయన బాటలోనే విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కొందరు నేతలతో కలిసి ప్రత్యేక వర్గాన్ని ఏర్పరచుకుని విజయనగరం పార్టీ కార్యాలయాన్ని స్థాపించారు. అప్పటికే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు బంగ్లాలో నగరపార్టీ కార్యాలయం నడుస్తోంది. ఈ పంచాయితీ టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదు. మీసాల గీతకు లభించాల్సిన గుర్తింపు ఇప్పటికీ దక్కలేదన్న వాదన వినిపిస్తోంది. పోనీ అశోక్ పెద్దరికమైనా నిలిచిందా అంటే అదీ లేదు. అశోక్మీద అమిత గౌరవం ఉందని చెప్పుకునే చంద్రబాబు పార్టీ కార్యాలయం విషయంలో అశోక్ పెద్దరికాన్ని స్థానిక నేతలు ధిక్కరిస్తున్నా ఏమీ చేయలేదు. ఆయన గౌరవాన్ని కాపాడలేదు. ఈ విషయంలో సీనియర్‌గా అశోక్ తన అనుచరుల వద్ద వాపో యారు. టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడైన మహంతి చిన్నంనాయుడు పార్టీ కార్యకలాపాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. ఇలా సీనియర్లకు, ముఖ్య నేతలకు టీడీపీలో విలువ ఉండకపోవడంతో ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. కొందరు వేరు కుంపట్లు పెట్టుకుంటున్నారు. -
విజయనగరం జిల్లాలో టీడీపీకి షాక్..
సాక్షి, విజయనగరం: జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఉత్తరాంధ్ర టీడీపీలో కీలక మహిళానేతగా పేరొందిన ఆ పార్టీ జిల్లా సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి పడాల అరుణ.. పార్టీకి గుడ్‌బై చెప్పారు. రాజీనామా ప్రతాన్ని పార్టీ అధ్యక్షుడికి పంపారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పడాల అరుణ పనిచేశారు. చదవండి: పల్లెల్లో చిచ్చు: టీడీపీ నయా కుయుక్తులు.. 33 ఏళ్లుగా టీడీపీలో పనిచేసినా, పావుగా వాడుకున్నారే తప్ప.. సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఇమడలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పడాల అరుణ తెలిపారు. అటు అధిష్టానం, ఇటు జిల్లా పార్టీ పెద్దలు కనీసం ప్రాధాన్యత ఇవ్వకపోవడం, రాష్ట్ర కమిటిలలో సైతం చోటు కల్పించకపోవడం వంటి కారణాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్న అరుణ.. టీడీపీకి గుడ్‌బై చెప్పారు. చదవండి: మేనిఫెస్టో పేరిట మరో మోసమా చంద్రబాబూ.. -
అరుణను కంటతడి పెట్టించిన 'బాబు'
పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. రాష్ట్రం లో శిశు సంక్షేమ శాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించిన ఓ ఆడపడుచు..‘తెలుగుదేశం’ తీరుతో కన్నీరు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో కీలకనేతగా ఉన్న పడాల అరుణ.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏకపక్ష ధోరణితో కన్నీటిపర్యంతమయ్యారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నియోజకవర్గంలో తనకు జరుగుతున్న అవమానాలను కొంతకాలంగా పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వాపోయారు. మూడు పార్టీలు మారిన వ్యక్తికి ప్రాధాన్యం ఇచ్చారని, ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తన ప్రమేయం లేకుండా అతనికి బీ ఫారాలు ఇవ్వడం దారుణమని అన్నారు. పార్టీ అధినేత గజపతినగరంలో సభ పెడుతున్న విషయం కూడా తనకు తెలియజేయకపోవడం బాధాకరమన్నారు. రెండున్నర దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని, క్రమశిక్షణ గల కార్యకర్తగా పని చేశానని, అటువంటి తనకు ఇదేనా ఇచ్చిన గుర్తింపు అంటూ ప్రశ్నించారు. గుర్తింపులేని చోట పని చేయడం కష్టంగా భావించి జిల్లా, రాష్ట్ర పార్టీ కార్యాలయాలకు తన రాజీనామాను పంపిస్తున్నట్లు ప్రకటించారు. అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. -
టీడీపీకి గుడ్‌బై చెప్పిన పడాల అరుణ
-
సేమ్ టు షేమ్!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ పరిస్థితి దయనీయంగా తయారైంది. చంద్రబాబు తీరు కారణంగా పార్టీలో అయోమయం నెలకొంది. నేతల మధ్య అంతర్గత పోరుతో ఎన్నికల రేసులో సైకిల్ వెనుకబడింది. ప్రతికూల పరిస్థితులతో కేడర్ గందరగోళంలో ఉన్నా రు. పార్టీ అధినేత జిల్లాలో పర్యటించినా టిక్కెట్ల పంచాయతీ కొలిక్కి రాలేదు. నామినేషన్ల ప్రక్రియ తుది దశకొచ్చినా స్పష్టత ఇవ్వలేదు. చీపురుపల్లిలో నాలుగు స్తంభాలాట.. చీపురుపల్లి టిక్కెట్ కేటాయింపుపై జరుగుతున్న హైడ్రామాతో కార్యకర్తలు, నాయకులు ఎవరి వెంట నడవాలో తేల్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రధాన ఆశావహుల జాబితాలో నిన్నటివరకు ముగ్గురే ఉన్నారనుకుంటే తాజాగా తెరపైకి నాలుగో వ్యక్తి వచ్చారు. కొ న్ని రోజులుగా కె.త్రిమూర్తులరాజు, గద్దే బాబూరావు, కిమిడి మృణాళిని టిక్కెట్ కోసం కుమ్ములాడుకుంటే పరిషత్ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన మీసాల వరహాలనాయుడు కూడా అందులో చేరారు. తన పేరు కూ డా పరిశీలించాలని గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఇక్కడ నాలుగు స్తంభాలాట సాగుతోంది. ఎవరికి వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఒకరు తన సా మాజిక వర్గం ద్వారా, మరొకరు నారాయణ విద్యా సంస్థ అధినేత ద్వారా, మిగిలిన ఇద్దరు సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహనరావు ద్వారా ప్రయత్నిస్తున్నారు. చేతి చమురు కూడా భారీగా వది లించుకుంటున్నారు. వీరిలో త్రిమూర్తులరాజు ఒక్కరే గత ఎన్నికల దగ్గరి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. అయితే, ఆయనకు టిక్కెట్ రాకుండా ఓ వర్గం గట్టిగా పనిచేస్తోంది. చంద్రబాబు కూడా ఎవరెక్కువ ఖర్చు పెట్టగలరని బేరీజు వేసుకుని టిక్కెట్ ఖరారు చేసే యోచనలో ఉన్నారు. కానీ, ఒక రోజు మాత్రమే నామినేషన్ గడువు ఉండటం, చివరి వరకు అభ్యర్థి ప్రకటించకపోవడంతో కేడర్ అయోమయంలో పడింది. నలుగురు నాయకులు వేర్వేరుగా శిబిరాలు నడపడంతో ఎవరివైపు ఉండాలో తేల్చుకోలేక కార్యకర్తలు సతమతమవుతున్నారు. విసిగి వేసారి, గ్రూపుల మధ్య మధ్య ఇమడలేక కొంతమంది క్లీన్‌గా ఉన్న వైఎస్సార్సీపీలోకి జారుకుంటున్నారు. చీపురుపల్లి టీడీపీ అభ్యర్థి ప్రకటన వెలువడగానే ఆ పార్టీ నుంచి భారీ ఎత్తున జంపింగ్‌లు జరగనున్నాయి. కురుపాంలో గందరగోళం కురుపాం పార్టీలో గందరగోళం చోటు చేసుకుంది. నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న నిమ్మక జయరాజ్‌తో పాటు కాంగ్రెస్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వి.టి.జనార్దన్ థాట్రాజ్ టిక్కెట్ కో సం ప్రధానంగా ఆశిస్తున్నారు. అధినేత టిక్కెట్ ఖరారు చేయకపోయినా మరొక రోజే గడువు ఉండడంతో తమకే దక్కుతుందన్న ఉద్దేశంతో ఇద్దరూ టీడీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. వారిద్దరే కాకుండా జనార్దన్ థాట్రాజ్ తల్లి, నర్సింహథాట్రాజ్ కూడా టీడీపీ తరపున నామినేషన్ వేశారు. మొత్తానికి ఆ పార్టీ తరఫున ముగ్గురు నామినేషన్ వేసినట్టయింది. మొత్తానికి అటు జయరాజ్, ఇటు థాట్రాజ్ రెండు వర్గాలుగా విడిపోవడంతో ఎవరి పక్క ఉండాలో తేల్చుకోలేక తీవ్రంగా నలిగిపోతున్నారు. అభ్యర్థి ప్రకటన వెలువడగానే ఓ వర్గం భగ్గుమనే అవకాశం ఉంది. చంద్రబాబు సభకు గైర్హాజరైన పడాల, కరణం గజపతినగరం నియోజకవర్గంలో మూడు గ్రూపులుగా ఉన్న టీడీపీలో చివరికి కొండపల్లి అప్పలనాయుడు గ్రూపే మిగిలింది. మిగతా రెండు గ్రూపులు పార్టీకి దూరంగా ఉండిపోయాయి. దీంతో టిక్కెట్ దక్కించుకున్న కేఏనాయుడుకి సంతోషం కరిగిపోయింది. అసమ్మతి కారణంగా ఓటమి తప్పదని పరిశీలకు భావిస్తున్నారు. ఎన్నికల్లో ఆయనతో కలిసి పనిచేసేది లేదని మాజీ మంత్రి పడాల అరుణ, మరో నేత కరణం శివరామకృష్ణ స్పష్టం చేశారు. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గ కేంద్రానికొచ్చి, ఎన్నికల ప్రచార సభ నిర్వహించినా ఆ ఇద్దరు నేతలు హాజరు కాలేదు. ఏం చేసుకున్నా పరావాలేదని చంద్రబాబు సభకు గైర్హాజరయ్యారు. వారి వద్దకు ఒకరిద్దరు నేతల్ని రాయబారానికి పంపినా పట్టించుకోలేదు. బుజ్జగింపులకు తలొగ్గని డీవీజీ శంకరావు.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి పూసపాటి అశోక్ గజపతిరాజు బుజ్జగించినా, పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ ప్రాథేయపడినా మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు కరగలేదు. పునరాలోచనే లేదని, రాజీనామాకు కట్టుబడే ఉన్నానని ఫోన్లో రాయబారం నెరిపిన ఆ ఇద్దరు నేతలతో నిర్మొహమాటంగా చెప్పేశారు. చంద్రబాబుతో మాట్లాడిస్తామని, స్పష్టమైన హామీ ఏదో ఇప్పిస్తామని ప్రలోభ పెట్టినా డీవీజీ రాజీ పడలేదు. ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదని కరాఖండీగా చెప్పేశారు. ఇదిలా ఉండగా, పార్టీ చేసిన అన్యాయాన్ని జీర్ణించుకోలేక డీవీజీ అనుచరులంగా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని ఒత్తిడి చేస్తున్నారు. చంద్రబాబు రాక ముందు జిల్లాలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో, ఆయన వచ్చి వెళ్లిన తరువాత కూడా అలాగే ఉన్నాయి. సమస్యలు పరిష్కరించలేకపోవడం ఒక విధంగా బాబుకు అవమానకరమే.