అక్టోబర్‌ 6న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ | army recruitment rally on october 6th | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 6న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

Published Tue, Sep 12 2017 11:12 PM | Last Updated on Tue, Sep 19 2017 4:26 PM

army recruitment rally on october 6th

అనంతపుర న్యూటౌన్‌:  విజయనగరంలోని రాజీవ్‌గాంధీ స్పోర్ట్స్‌ స్టేడియంలో అక్టోబర్‌ 6 నుంచి 17 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరుగనుంది. ఇందులో పాల్గొనేందుకు అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్‌, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు మాత్రమే అర్హులని జిల్లా యువజన శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటేశం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 20 లోపు  దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు  www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు.

అదేవిధంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న యువకులు తమ అర్హతను తెలిపే వివరాలను ‘ముఖ్య కార్యనిర్వహణాధికారి, యువజన సంక్షేమశాఖ, ఆన్‌సెట్, అనంతపురం’ చిరునామాలో ఈనెల 14లోపు అందించాలని కోరారు. దరఖాస్తుదారులకు 15వ తేదీ ఉదయం 9 గంటలకు ఆర్ట్స్‌ కళాశాలలో స్క్రీనింగ్‌టెస్ట్‌ నిర్వహించి అర్హత సాధించిన వారికి యువజన సర్వీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణనందిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement