
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 9 గంటలైనా వాహనాలు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి. ఫలితంగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.