జిల్లాలోని ఆంధ్రా ఒడిశా సరిహద్దులో శనివారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం.
విజయనగరం: జిల్లాలోని ఆంధ్రా ఒడిశా సరిహద్దులో శనివారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఓ మావోయిస్టు కీలక నేత మృతి చెందినట్లు తెలిసింది. మావోయిస్టులు ఉన్నట్లు ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు.. అడవిలోకి వెళ్లారు. మావోలు తారసపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో మావో కమాండర్ చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.