గిరిజన గ్రామాల్లో కలెక్టర్ పర్యటన
Published Fri, Jun 30 2017 4:23 PM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM
విజయనగరం: విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని గిరిజన గ్రామాలైన కొత్తవలస, గండ్రాపు వలస గ్రామాల్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పర్యటించారు. విద్యార్థులు జ్వరాల బారినపడిన కొత్తవలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఆయన పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణపై తనిఖీలు నిర్వహించారు.
ఇటీవల దిగువ గంజాయిగూడలో జ్వరంతో మరణించిన బాలిక కుటుంబానికి ఐదువేల ఆర్థిక సహాయం అందించారు. గండ్రాపువాలసలో మలేరియా నియంత్రణకు చేస్తున్న స్ప్రేయింగ్ ను పరిశీలించారు. జిల్లాలో 55 మంది వైద్యాధికారుల్ని తక్షణమే నియమించనున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement