tribal villages
-
‘గిరి’ సీమల్లో ‘జుగా’ వెలుగులు
హన్మకొండ: అన్ని గిరిజన గ్రామాల్లో విద్యుత్ కాంతులు విరజిమ్మనున్నాయి. ప్రతీ ఇంటిని విద్యుదీకరించాలని కేంద్ర ప్రభుత్వం తాజగా నిర్ణయించింది. మెజారిటీ గిరిజన జనాభా ఉండి ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యానికి నోచుకోని గ్రామాల్లో వెలుగులు నిండనున్నాయి. ప్రతీ ఇంటికి ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. అవసరమైన చోట నూతనంగా విద్యుత్ లైన్లు వేయడంతోపాటు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు. అటవీ ప్రాంతంతోపాటు ఇతర కారణాలతో విద్యుత్ లైన్లు వేయలేని గ్రామాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు.తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) పరిధిలో మెజారిటీ గిరిజన జనాభా కలిగిన 1,049 గ్రామాలు, తెలంగాణ సదరన్ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీఎస్ఎల్) పరిధిలో 229 గ్రామాల్లోని గిరిజన ఇళ్లలో వెలుగులు నింపనున్నారు. ఈ మేరకు ఎన్పీడీసీఎల్ సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను తయారు చేసింది. మెజారిటీ గిరిజన జనాభా ఉన్న 695 గ్రామాల్లోని 25,393 గృహాలకు, 732 ప్రభుత్వ, ప్రభుత్వ రంగ కార్యాలయాలకు విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు. మొత్తం రూ.144.42 కోట్ల వ్యయం అంచనాతో డీపీఆర్ రూపొందించగా.. దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు.దేశంలో 5 కోట్ల మందికి లబ్ధిగిరిజనులకు మెరుగైన సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచేందుకు, గ్రామాల్లో కనీస వసతులు, సౌకర్యాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధా న మంత్రి జన్‌జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ (పీఎం జుగా) అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 63 వేల గ్రామాల్లో 5 కోట్ల మంది గిరిజనులకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా 25 రకాల సహాయాలు అందుతాయి. 17 మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్నాయి. సామాజిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, జీవనోపాధిలో ఉన్న కీలకమైన అంతరాలను పూడ్చేలా ఈ స్కీమ్‌ను రూపొందించారు.రూ.144.42 కోట్ల వ్యయంతో..ఇప్పటికే ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ద్వారా జనసమూహాలకు దూరంగా ఉండి మౌలి క సదుపాయాలకు నోచుకోని కోలం, తొట్టి గిరిజనులు నివా సముండే ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోని 257 అవా సాల్లో 3,345 గృహాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించారు. అదే విధంగా దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి ద్వారా రూ.125కే విద్యుత్ పంపిణీ సంస్థ సొంతగా ఖర్చులు భరించి పేదలకు విద్యుత్ సౌకర్యం కల్పించింది. అయినా ఇప్పటి కీ విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉన్న మెజారిటీ గిరిజను లున్న గ్రామాలు, గృహాల కోసం కేంద్రం ‘పీఎం జుగా’ను తెచ్చింది.ఎన్పీడీసీఎల్ పరిధిలోని 15 జిల్లాల్లో జగిత్యా ల, పెద్దపల్లి జిల్లాల్లో విద్యుత్ సౌకర్యం లేని గృహాలేమీ లేవు. మిగతా 13 జిల్లాల్లో 1,049 మెజారిటీ గిరిజన జనాభా కలిగిన గ్రామాలు ఉన్నట్లు గుర్తించా రు. ఇందులో 25,393 గృహాలు, 732 ప్రభు త్వ కార్యాలయాలు (మొత్తం 26,125) ఉన్నా యి. కాగా ఆన్ గ్రిడ్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించే వీలున్న గ్రామాలు 24,753 ఉన్నా యి. వివిధ కారణాలవల్ల విద్యుత్ సౌకర్యం క ల్పించడం వీలుకాని 640 గ్రామాల్లో సోలార్ ద్వారా గృహాలను విద్యుదీకరించనున్నారు. ఈ గ్రామాలు, గృహాల కు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి రూ.144.42 కోట్ల వ్య యంతో 352 కిలోమీటర్ల మేర 11 కేవీ లైన్, 592 కి.మీ. సింగిల్ లైన్, 1,668 కి.మీ. ఎల్టీ లైన్ నిర్మించనున్నారు. 1,565 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు బిగించనున్నారు. ఈ స్కీమ్ అమలుకు కావాల్సిన ఖర్చులన్నీ కేంద్రమే భరిస్తుంది. -
చింతలపూడి గిరిజన గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు
-
అడవిలో 15 కిమీ నడిస్తే గాని మా ఊరు రాదు..జగన్ వచ్చాకే మా జీవనం మెరుగ్గా..
-
గిరిజన గూడేల్లో వెలుగులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో అనేక గిరిజన ఆవాసాల్లో మొన్నటివరకు కరెంటంటే ఏమిటో తెలియని పరిస్థితి. కొన్ని ఆవాసాల్లో సోలార్ ప్యానల్స్ ద్వారా గతంలో కరెంటు సరఫరా ఇచ్చామనిపించారు. అయితే ఇక్కడ కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే కరెంటును వినియోగించుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అలాకాకుండా రెగ్యులర్‌గా విద్యుత్ స్తంభాలు వేసి రోజంతా విద్యుత్ సరఫరా అయ్యే విధంగా పనులు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏజెన్సీ ప్రాంతంపై ప్రత్యేకశ్రద్ధ పెట్టారు. ఇప్పటికే అన్ని గిరిజన ఆవాసాలకు రోడ్డు వసతికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి గిరిజన గూడేనికి విద్యుత్ సరఫరా ఉండాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించారు. మొదటి విడతలో 85 గిరిజన ఆవాసాల్లో విద్యుత్ సరఫరా పనులు చేపట్టారు. కొన్ని ఆవాసాల్లో పనులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మిగిలిన ఆవాసాల్లో కూడా విద్యుత్ పనులు చేపట్టనున్నారు. విశాఖ ఏజెన్సీలో 3,574 ఆవాసాలు ఏజెన్సీలో గ్రామాల సంఖ్య, వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం మొన్నటివరకు ఎవరివద్దా లేవు. ప్రభుత్వశాఖలు ఒక్కొక్కటి ఒక్కో సమాధానం చెప్పేవి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీపై పూర్తిసమాచారం కోసం ప్రత్యేకంగా సర్వే చేసింది. ఈ సర్వే ద్వారా ఆవాసాల సంఖ్య, అక్కడి సమస్యలు, సౌకర్యాల సమాచారం అందింది. విశాఖ ఏజెన్సీలో 3,574 ఆవాసాలున్నాయని, 1,21,727 కుటుంబాలకు చెందిన 6,04,047 మంది నివసిస్తున్నారని తేలింది. ఇంకా 149 ఆవాసాలకు కరెంటు సదుపాయం లేదని తెలిసింది. దీంతో వెంటనే 85 ఆవాసాల్లో కరెంటు సదుపాయం కల్పించే మొదటివిడత పనులను ప్రభుత్వం రూ. 50 కోట్లతో చేపట్టింది. విద్యుత్‌శాఖ కేవలం 85 ఆవాసాల్లో మాత్రమే కరెంటు సదుపాయం లేదని, వాటికి డిసెంబర్ నాటికి కరెంటు వసతి కల్పిస్తామని చెబుతోంది. ఒకవేళ తాజా సర్వే ప్రకారం మరిన్ని ఆవాసాలకు అవసరమైతే అక్కడ కూడా విద్యుత్ సరఫరా పనులు చేపడతామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. కేంద్రాన్ని తప్పుదారి పట్టించిన నాటి చంద్రబాబు ప్రభుత్వం దేశంలోని అన్ని కుటుంబాలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని 2014లో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుని ‘పవర్ ఫర్ ఆల్’ పేరుతో కార్యక్రమం ప్రారంభించింది. 2014 డిసెంబర్లో చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు, ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని నిర్దేశించింది. మార్చి 2017 నాటికి రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా మారుమూల గ్రామాలకు అవసరమైన విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్రం వివిధ పథకాల ద్వారా నిధులు విడుదల చేసింది. నేరుగా విద్యుత్ స్తంభాల ద్వారా తీగలను లాగి విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అవకాశం లేని ఏజెన్సీ ప్రాంతాల్లో సౌరఫలకల ద్వారా సౌర విద్యుత్ కూడా సరఫరా చేసేందుకు కేంద్రం నుంచి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిధులు తీసుకుంది. అంతిమంగా మార్చి 2017 నాటికి రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని ఘనంగా ప్రకటించేసింది. వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికీ విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 149 ఆవాసాలకు కరెంటు సౌకర్యం లేదంటే చంద్రబాబు ప్రభుత్వం కేంద్రాన్ని తప్పుదారి పట్టించిందని అర్థమవుతోంది. అన్ని ఇళ్లకు కరెంటు సౌకర్యం కల్పించామని కేంద్రం నుంచి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిధులను ఏంచేశారనే విషయం తేలాల్సి ఉంది. ► అరకు నియోజకవర్గం హుకుంపేట మండలంలోని మందబుద్ది గ్రామానికి మొన్నటివరకు కరెంటు లేదు. కొండకోనల్లో ఉండే ఈ ఆవాసానికి కరెంటు పోల్స్ తీసుకెళ్లి.. తీగలు లాగి వెలుగులు నింపింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ఊళ్లో విద్యుత్ వెలుగులు నిండాయి. ► అనంతగిరి మండలంలోని దాయార్తి గ్రామ ప్రజలు.. మా ఊరికి కరెంటివ్వాలని గతంలో అనేకసార్లు నిరసనలు చేశారు. పొద్దుపోయాక కనీసం గూడెం నుంచి బయటకురాలేని దుస్థితి. పురుగుపుట్రతో ఇబ్బందులు. కొద్దిరోజుల కిందట ఈ గిరిజన గూడెంలో కరెంటు బల్బులు వెలిగాయి. ఇన్నాళ్లూ చీకట్లోనే.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా మా గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేదు. కటిక చీకట్లోనే కాలం వెల్లదీశాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఊరికి కరెంటొచ్చింది. – కొర్ర మల్లన్న, బందబుద్ది గ్రామం, హుకుంపేట మండలం దశాబ్దాల కల నెరవేరింది దశాబ్దాలుగా అటవీ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నాం. ఇన్నాళ్లు గుడ్డి దీపాలే దిక్కు. జగనన్న సీఎం అయ్యాక మా గ్రామంలో విద్యుత్ సౌకర్యం కల్పించారు. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్య తీరింది. – సీదరి మల్లేష్, రీడబంద గ్రామం, హుకుంపేట మండలం కరెంటివ్వమన్నా ఇన్నాళ్లు ఇవ్వలేదు మండల కేంద్రం అనంతగిరి నుంచి మా గ్రామానికి 125 కిలోమీటర్ల దూరం. మా గ్రామంలో 25 కుటుంబాలున్నాయి. రాత్రిళ్లు జంతువుల బెడద ఎక్కువ. కరెంటు లేకపోవడంతో బయటకు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎన్నోసార్లు నిరసన చేపట్టినా మా సమస్యను పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక మా సమస్య పరిష్కారమైంది. రెండు నెలల కిందటే మా గ్రామానికి కరెంటు వచ్చింది. – కొర్ర సోమన్న, దాయార్తి గ్రామం, అనంతగిరి మండలం -
'గంజాయి'పై కదిలిన గ్రామ చైతన్యం
కొయ్యూరు: గంజాయిని రాష్ట్రంలో సమూలంగా నాశనం చేయాలన్న ప్రభుత్వం పిలుపు మేరకు ఆ గ్రామంలోని యువకులు ముందుకు కదిలారు. తమ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో సాగవుతున్న గంజాయి తోటలను ధ్వంసం చేయటంతోపాటు.. ఇకపై గ్రామస్తులు ఎవరూ గంజాయి పండించకూడదని తెలియజెప్పారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ చౌడుపల్లి గ్రామాన్ని ఆనుకొని అటవీ ప్రాంతం ఉంది. కొందరు గ్రామస్తులు అక్కడ గంజాయిని పండిస్తున్నారు. గ్రామ యువకులు పలువురు గురువారం అక్కడికి చేరుకుని, సుమారు ఎకరం విస్తీర్ణంలో సాగవుతున్న గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక నుంచి గ్రామస్తులు ఎవరూ గంజాయిని పండించరని, ఎవరైనా తోటలను వేస్తే పోలీసులకు సమాచారం ఇచ్చి, వారిపై చర్యలు తీసుకునేలా చేస్తామని చెప్పారు. దీనిపై కొయ్యూరు సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ.. గంజాయి ఎక్కువగా సాగవుతున్న మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రజలు ఈ విధంగా చైతన్యవంతులై గంజాయి తోటలను స్వయంగా వారే ధ్వంసం చేయటం శుభపరిణామమన్నారు. -
అడవికి రాచబాట!
► విశాఖ జిల్లా పెదబయలు మండలంలోని నివాసిత ప్రాంతం కొండ్రుకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రోడ్డు సౌకర్యం లేదు. కొండలు, గుట్టలు ఎక్కి వెళ్లాల్సిందే. ఇప్పుడు ఆ దుస్థితి తొలగనుంది. గుల్లేలు నుంచి కొండ్రుకు రూ.15.93 కోట్లతో 18.40 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ► డుంబ్రిగుడ మండలం సోవ్వ నుంచి చెమడపొడు వరకు 22 కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు ప్రభుత్వం రూ.11.42 కోట్లను వెచ్చిస్తోంది. ఇప్పటిదాకా అక్కడ రోడ్డు సదుపాయం లేదు. ► పెదబయలు మండలం రుద్రకోట నుంచి కుమడ పంచాయతీ కిందుగూడ మీదుగా ఒడిశా సరిహద్దు వరకు రహదారి పనులు జరుగుతున్నాయి. కిందుగూడకు ఇన్నేళ్లుగా కేవలం మట్టి రోడ్డు మాత్రమే ఉంది. వర్షాకాలం అక్కడకు వెళ్లాలంటే అసాధ్యమే. ఇప్పుడు అక్కడ 25.60 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.16 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. ► ముంచంగిపుట్టు మండలం బుంగపుట్ ఏజెన్సీ గ్రామానికి 25 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ.14 కోట్లు ఖర్చు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా మారుమూల గిరిజన ప్రాంతాలకు మౌలిక వసతులు కరువయ్యాయి. విశాఖ ఏజెన్సీలోని పలు నివాసిత ప్రాంతాలకు రహదారుల సదుపాయం లేక అడవి బిడ్డలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. తప్పనిసరైతే కొండకోనల్లో ప్రయాసలతో వెళ్లాల్సిందే. మట్టి రోడ్లున్నా వర్షాకాలంలో అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితి. ఇక అనారోగ్య సమస్యలు తలెత్తితే దేవుడిపై భారం వేయాల్సిందే. ఈ దుస్థితిని తొలగించి ఏజెన్సీ గ్రామాలకు మట్టి రోడ్లు కాకుండా మెటల్, బీటీ రోడ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి చకచకా పనులు జరుగుతున్నాయి. విడతలవారీగా ఏజెన్సీ గ్రామాలకు రోడ్ల సదుపాయాన్ని కల్పిస్తున్నారు. తద్వారా రవాణా సదుపాయం పెరిగి రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. 548.91 కిలోమీటర్లు... రూ.308.98 కోట్లు విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం 11 మండలాలున్నాయి. ఇందులో 3,789 నివాసిత ప్రాంతాల్లో (ఆవాసాలు) 6,58,354 మంది జీవనం సాగిస్తున్నారు. వీటిల్లో 1,610 నివాసిత ప్రాంతాలు, గ్రామాలకు మాత్రమే రోడ్డు కనెక్టివిటీ ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏజెన్సీ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. రూ.308.98 కోట్లతో గత రెండేళ్లలో 340 నివాసిత ప్రాంతాలకు 548.91 కిలోమీటర్ల మేర రోడ్డు సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టడంతో మొత్తం 1,950 ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తోంది. ఇంకా 1,839 నివాసిత ప్రాంతాలకు రోడ్డు సదుపాయాన్ని కల్పించాల్సి ఉంది. ఇందుకోసం రూ.714 కోట్ల మేర నిధులు అవసరమని అంచనా వేశారు. సాగు హక్కులు.. పథకాల ప్రయోజనం ఇప్పటికే గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల ద్వారా భూ పంపిణీ చేపట్టి సాగు హక్కులు కల్పించి ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. గిరిజన గ్రామాల్లో కూడా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) సేవలతో పాటు హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. గిరిజనులకు వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించింది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ఏజెన్సీలోని అన్ని నివాసిత ప్రాంతాలకు రోడ్ల సదుపాయాన్ని కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏజెన్సీ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ ఏజెన్సీ గ్రామాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి సర్వే చేపట్టింది. ‘కనెక్ట్ పాడేరు’ పేరుతో అన్ని వివరాలను సేకరిస్తున్నాం. రోడ్డు సౌకర్యం లేక గర్భిణులు బాగా ఇబ్బంది పడుతున్నారు. గత రెండేళ్లుగా 340 నివాసిత ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించేలా పనులు జరుగుతున్నాయి. –ఆర్.గోపాలకృష్ణ, ఐటీడీఏ పీవో దశాబ్దాల కల సాకారం గుల్లేల గ్రామం నుంచి కొండ్రు వరకు దశాబ్దాల తర్వాత రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాలకు చెందిన గిరిజనుల రవాణా కష్టాలు తీరతాయి. రహదారి సమస్యను గతంలో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇన్నాళ్లకు మా కల నెరవేరుతోంది. – వరద నాగేశ్వరరావు, ఇంజిరి పంచాయతీ, పెదబయలు మండలం డోలి కష్టాలకు తెర... సోవ్వ నుంచి ఒడిశా బోర్డర్ వరకు రహదారి నిర్మాణం జరుగుతుండడం శుభపరిణామం. సరైన రవాణా వ్యవస్థ లేక అత్యవసర పరిస్థితుల్లో మేం పడుతున్న కష్టాలు ఆ దేవుడికే తెలుసు. రోగులు, గర్భిణులను డోలిలో మోసుకుంటూ ఆస్పత్రులకు తరలించే కష్టాలు తీరనున్నాయి. ఈ రోడ్డు పూర్తయితే పలు గ్రామాలకు ఉపయోగం. ఒడిశా వాసులకు సైతం రవాణా సౌకర్యం కలుగుతుంది. – తిరుమలరావు, సోవ్వ గ్రామం, డుంబ్రిగుడ మండలం -
గిరిజన గ్రామాల్లో 4జి జియో సేవలు
సాక్షి, అమరావతి: దేశంలో టెలికాం రంగ రూపురేఖలను మార్చిన డిజిటల్ విప్లవం ఇప్పుడు రాష్ట్రంలోని గిరిజన గ్రామాలకు చేరింది. రిలయన్స్ జియో తాజాగా రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో 1,529 టెలికాం టవర్లను ఏర్పాటు చేసి తన మొబైల్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసింది. దీంతో ఇప్పుడు అరకులోయ, బొర్రా గుహలు, లంబసింగి, కొత్తపల్లి జలపాతాలు 4జి నెట్వర్క్ పరిధిలోకి వచ్చాయి. తన నెట్వర్క్ విస్తరణలో భాగంగా రిలయన్స్ జియో పాడేరు, చింతపల్లి, మారేడుమిల్లి, రంపచోడవరం, అడ్డతీగల, జి.మాడుగుల, పెదబయలు, జి.కె.వీధి, డుంబ్రిగూడ వంటి మారుమూల గ్రామాలకు ఇప్పుడు హై–స్పీడ్ 4జి సేవలు అందిస్తోంది. ఫలితంగా ఈ ప్రాంతాల్లో నివసించే విద్యార్థులు ఈ కరోనా సమయంలో బయటకు వెళ్లకుండా వారి విద్యను కొనసాగించడానికి, ప్రజలు సురక్షితంగా ఉండడానికి సహాయపడుతోంది. -
సంస్మరణంపై ‘డ్రోన్’ నిఘా
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో పారా మిలటరీ, పోలీసు బలగాలు మళ్లీ అప్రమత్తమయ్యాయి. కరోనా, కోవర్టుల కారణంగా ఇటీవల మావోయిస్టు పార్టీ పలువురు ఉద్యమకారులను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుందామని ఆ పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో గతంలో ఏటా రెడీమేడ్ స్థూపాలు ఏర్పాటు చేసి వారోత్సవాలు ఘనంగా నిర్వహించేవారు. మావోయిస్టులు క్రమంగా ఈ ప్రాంతాల్లో పట్టు కోల్పోవడంతో కొన్నేళ్లుగా మైదాన ప్రాంతాల్లో నిర్వహించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు, తర్వాత కూడా నక్సల్స్‌పై ప్రభుత్వాల వైఖరి మారలేదు. ఓ వైపు పోలీస్ ఎన్కౌంటర్లు, మరోవైపు కరోనా మావోయిస్టు పార్టీ కీలక నేతలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు తప్పకుండా నిర్వహించాలని పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. ఘనంగా నిర్వహించేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తుండగా, అడ్డుకునేందుకు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండటంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. డేగ కన్ను, ‘డ్రోన్’నిఘా... మూడు రాష్ట్రాల్లో సాయుధ పోలీసు బలగాలు మావోయిస్టు వారోత్సవాలపై డేగకన్ను వేశాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గోదావరి తీరం వెంట పోలీసు క్యాంపులు ఏర్పాటు చేశారు. తూర్పు డివిజన్ సరిహద్దుల్లో పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. మహాముత్తారం, మహదేవపూర్, ఏటూరునాగారం అటవీ ప్రాంతాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. అటవీ ప్రాంతాల్లో పోలీస్ బలగాలు నిరం తరం కూంబింగ్ నిర్వహిస్తున్నా యి. ఇటీవల ములుగు–భూపాలపల్లి–పెద్దపల్లి జిల్లాల మావోయిస్టు పార్టీ క మిటీ కార్యదర్శి కంక నాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ పేరిట పలు ప్రజా సమస్యల విషయమై అధికార పార్టీ నేతలపై హెచ్చరి కలు జారీ చేయడంతో పోలీస్‌లు అప్రమత్తమ య్యారు. గిరిజన గ్రామాలపై ‘డ్రోన్’నిఘా కొనసాగుతోంది. -
చంచి భీమల్ దేవుడి కల్యాణంతో..
కెరమెరి(ఆసిఫాబాద్): అనాదిగా వస్తున్న ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడడంలో ఆదివాసీలు ముందుంటున్నారు. ఇటీవల మృగశిర కార్తె ప్రవేశించడంతో ‘గిరి’ గ్రామాల్లో రెండు రోజులుగా విత్తనపూజకు శ్రీకారం చుట్టారు. ఏటా విత్తన పూజతోనే తమ పొలాల్లో విత్తనాలు నాటడం ప్రారంభిస్తారు. దేవతలకు విత్తనాలను చూపిస్తారు మేలో అన్ని గ్రామాల్లో గ్రామ పటేల్ ఇంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆదివాసీల కులదైవమైన పాటేరు అమ్మోరు, జంగుబాయి, గాంధారి కిల్ల, పద్మాల్పురి కాకో వద్దకు వెళ్లి విత్తనాలు చూపిస్తారు. అక్కడే దేవతల ఆశీర్వాదం తీసుకుని తిరుగుపయనమవుతారు. అనంతరం గ్రామంలో ఉన్న ఆకీపేన్, అమ్మోరు, పొచమ్మ వద్దకు వెళ్లి విత్తనాలతో పూజలు చేస్తారు. అక్కడ పటేల్ ఇచ్చే విత్తనాలను ఇంటికి తీసుకెళ్తారు. అదే రోజు రాత్రి రెండున్నర కిలోల జొన్నలను గడ్క తయారు చేసి ఆరగిస్తారు. అర్ధరాత్రి అడవికి వెళ్లి (కుమ్ముడ్) చెట్టు ఆకులను తీసుకువచ్చి డొప్పలు తయారు చేసి అన్ని ఇళ్లల్లో ఇస్తారు. అందులో పూజ చేసిన విత్తనాలను వేçస్తారు. ఇదంతా మృగశిర మాసానికి కొద్దిరోజుల ముందుగానే నిర్వహిస్తారు. విత్తన పూజలు(మొహతుక్) విత్తనపూజ చేసేరోజు రైతు కుటుంబమంతా ఉదయాన్నే పొలం బాట పడతారు. జొన్నతో గడ్క తయారు చేసి కులదైవంతో పాటు నేలతల్లికి సమర్పిస్తారు. అనంతరం పొలంలో విత్తనాలు చల్లి అరకకు ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటుతారు. గ్రామపటేల్ ఇంటి ఎదుట మహిళలు సాంప్రదాయ నృత్యం చేస్తారు. పురుషులు గిల్లిదండా ఆట ఆడుతారు. అనంతరం సహపంక్తి భోజనం చేస్తారు. చంచి భీమల్ దేవుడి కల్యాణంతో.. మరికొందరు ఇలా చెప్తున్నారు. ఆదివాసీల ఇష్టదైవమైన చంచి భీమల్ దేవుడి కల్యాణం సందర్భంగా ఏటా ఏప్రిల్‌లోనే విత్తనాలను దేవుడికి చూపిస్తారు. ఆ రోజు ఆదివాసీలు భీమల్ దేవుడికి సాంప్రదాయ పూజలు చేస్తారు. అడవుల్లో లభించే ఆకులతో ఆరు డొప్పలను తయారు చేస్తారు. అందులోనే అన్ని విత్తనాలను కలిపి దేవునికి చూపిస్తారు. అనంతరం వాటిని ఇంటికి తీసుకెళ్లి దాచిపెడతారు. ఆరోజు పిండివంటలు చేసి ఆరగిస్తారు. మృగశిర కార్తే ప్రారంభంతో దాచిపెట్టిన విత్తనాలను తమ పంటపొలాల్లో చల్లుతారని మరికొందరు చెప్తున్నారు. -
‘సీతక్క మీరు చరిత్రలో నిలిచిపోతారు..’
ములుగు : కరోనా కష్టకాలంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క చేస్తున్న సాయంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. రోడ్డు మార్గం లేని గిరిజన గ్రామాలకు సైతం వెళ్లి.. లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న అక్కడివారికి నిత్యావసరాలు అందిస్తున్నారు. కొన్నిచోట్ల ఆహారం కూడా పంపిణీ చేస్తున్నారు. గత 38 రోజులుగా ఆమె పేదలకు సాయం అందిస్తూనే ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరు పేదలకు సాయం అందించాలని కోరుతున్నారు. ఇందుకోసం ‘గో హంగర్ గో’ చాలెంజ్‌ను ప్రారంభించారు. తాజాగా 39 వరోజు(ఆదివారం) సీతక్క పొనుగోలు గ్రామంలో బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇందుకోసం కొద్ది దూరం బైక్‌పై, మరికొంత దూరం సరైన మార్గంలేని రాళ్లు, రప్పల్లో కాలినడకన ప్రయాణించారు. ఇలా 16 కి.మీ ప్రయాణించి ఆ ఊరికి చేరుకున్నారు. రోడ్డు కూడా సరిగా లేని మార్గంలో నిత్యావసరాలు మోసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సీతక్క మిమ్మల్ని చరిత్ర గుర్తుంచుకుంటుంది, మీకు భగవంతుడు మరింత శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాం.. అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చదవండి : అప్పుడు.. ఇప్పుడు.. ప్రజాసేవకే! -
జల్, జంగిల్, జమీన్.. వాళ్ళ జన్మ హక్కు
ఒడిశా, బరంపురం: జల్, జంగిల్, జమీన్ ఆదివాసీల జన్మ హక్కు. అయితే గత 73 ఏళ్లలో ప్రభుత్వాలు మారాయి. పాలకులు, ఏలికలు మారుతున్నారు కానీ ఆదివాసీల తలరాతలు మాత్రం మారడం లేదు. ఆదివాసీలకు కల్పిస్తున్న వివిధ కేంద్ర, రాష్ట్ర పభుత్వ పథకాలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారికి అందడం లేదు. ఇప్పటికీ చాలా ఆదివాసీ గ్రామాలకు కనీస మౌలిక సౌకర్యాలు లేక వారి బతుకులు అగమ్య గోచరంగా మారాయి. ఆదివాసీల గూడాలకు రహదారులు లేవు. తాగేందుకు నీరు లేదు. తినేందుకు పౌష్టిక ఆహారం కరువైంది. ఇక విద్య, వైద్యం మాట దేవుడెరుగు. ఈ పరిస్థితి సాక్షాత్తు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని పులసర సమితి పరిధిలో గల జింకపడా పంచాయతీలోని ఆదివాసీ గ్రామాల్లో నెలకొంది. ఈ పంచాయతీలోని ఆదివాసీ గ్రామాలు సంపూర్ణ దయనీయ స్థితిలో జీవనం గడుపుతున్నాయి. కూలిపోయే స్థితిలో వంతెన ఈ గ్రామాలకు వెళ్లేందుకు మంచి రహదారి లేదు. పంచాయతీలోని గ్రామాలకు వెళ్లాలంటే మూడు చిన్న నదులు దాటుకుని వెళ్లవలసి వస్తోంది. వాటిలో ఒక నదిపై పట్టి కర్రలతో తయారైన వంతెనపైనుంచి ఆదివాసీ గ్రామాల ప్రజల రాకపోకలు సాగడంతో ఆ ఉన్న వంతెన కూడా ప్రమాద కర స్థితికి చేరుకుంది. ఏడేళ్ల క్రితం మహాత్మాగాంధీ గ్రామీణ అభివృద్ధి ఉపాధి పథకం కింద ఈ వంతెన నిర్మాణం జరిగింది. గ్రామస్తుల రాక పోకలతో వంతెన కూలిపోయే స్థితికి చేరుకుంది. జింకపడా గ్రామ పంచాయతీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లే ఆదివాసీ పిల్లలు 2 కిలోమీటర్లు అటవీ మార్గం గుండా రెండు నదులు, విరిగిన వంతెన దాటుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. ఈ పంచాయతీలో నివసించే ఆదివాసీలు మంచి నీరు తాగేందుకు కొండపై నుంచి వస్తున్న సెలయేటిపై ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలు స్థానిక రాజకీయ నాయకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ గ్రామస్తులకు అందడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే ఈ పంచాయతీలోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లే రహదారి, తాగునీరు, వైద్యం, విద్య సౌకర్యాలు అందజేయాలని ఆదివాసీ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. దుర్గపంకా ఆదివాసీ గ్రామస్తులకు మట్టి రోడే గతి -
ప్రసవ వేదన
సాక్షి, సాలూరు: గిరిశిఖర గ్రామాల గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. కాన్పుకు ముందే ఆస్పత్రుల్లో చేరాలన్న వైద్యుల సూచనను పట్టించుకోకపోవడం కష్టాలకు గురిచేస్తోంది. అత్యవసర వేళ నరకయాతన పడుతున్నారు. దీనికి పాచిపెంట మండలంలోని పెద్దవలస పంచాయతీ ఈతమానువలస గ్రామానికి చెందిన లావుడుజన్ని కస్తూరీ ప్రసవ వేదనే నిలువెత్తు సాక్ష్యం. కస్తూరీకి బుధవారం అర్ధరాత్రి పురుటినొప్పులు వచ్చాయి. రోడ్డు సదుపాయం ఉండడంతో 108కు ఫోన్ చేశారు. అయితే, గ్రామానికి వెళ్లే మార్గంలో మసాలాగెడ్డపై వంతెన లేకపోవడం, వర్షాలకు గెడ్డ ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనరాకపోకలు నిలిచిపోయాయి. డోలీ సహాయంతో గెడ్డ సమీపం వరకు గర్భిణిని తీసుకొచ్చారు. గెడ్డ దాటే అవకాశం లేక అక్కడ గురువారం ఉద యం వరకు నిరీక్షించారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు పాచిపెంట వీరంనాయుడు గర్భిణీని తరలించే ఏర్పాట్లు చేశారు. మంచానికి తాళ్లు కట్టి డోలీగా మార్చారు. అందులో కస్తూరిని పడుకోబెట్టి అతికష్టం మీద వాగును దాటించారు. ప్రైవేటు వాహనంలో ఆమెను పాచిపెంట పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి సాలూరు సీహెచ్‌సీకు, తరువాత విజయనగరం ఘోషాస్పత్రికి రిఫర్ చేశారు. గురువారం సాయంత్రం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. గర్భిణి ప్రసవ కష్టాలను పాచిపెంట పీహెచ్సీ వైద్యాధికారి లక్ష్మివద్ద ప్రస్తావించగా కేసు పార్వతీపురానికి చెందినదిగా పేర్కొన్నారు. ఆమెను జీఎల్ పురం వైటీసీలోని గిరిశిఖర గర్భిణుల వసతి గహంలో చేర్పించాల్సి ఉందన్నారు. ఆమె ఈతమానువలస గ్రామానికి 10 రోజులు క్రితమే వచ్చిందని, హైరిస్క్ కేసుగా గుర్తించి రిఫర్ చేసినా వినిపిం చుకోలేదన్నారు. -
గిరి పల్లెల్లో విద్యుత్ కాంతులు
ఒకటి.. రెండు కాదు ఏకంగా 125 గిరిజన గ్రామాలకు విద్యుత్ సమస్య తొలగిపోయింది. తూర్పువిద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఎస్ఈ టి.వి.సూర్యప్రకాశ్ బుధవారం కృష్ణాదేవిపేట నుంచి కాకరపాడు వరకు వేసిన 26 కిలోమీటర్ల 11 కేవీ విద్యుత్ లైన్‌ను ప్రారంభించారు. దీంతో ఇంత వరకు పూర్తిస్థాయి విద్యుత్ సరఫరాను తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం 132)33 కేవీ నుంచి పొందిన కాకరపాడు సబ్‌స్టేషన్ ఇప్పుడు దానిని ప్రత్యామ్నాయంగా వాడనుంది. కృష్ణాదేవిపేట 33/11కేవీ లైన్ నుంచి సరఫరా అవుతుంది. రూ.2.5 కోట్లతో 26 కిలోమీటర్ల దూరంలో 443 స్తంభాలను, 35 టవర్లను నిర్మించారు. పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా కానుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, కొయ్యూరు/గొలుగొండ: విద్యుత్ సమస్యలు గిరిజనులకు తీరనున్నాయి. ఇప్పటి వరకూ వేరే జిల్లా నుంచి విద్యుత్ సరఫరా అయ్యే సందర్భంలో సాంకేతిక కారణాలతో పడిన ఇబ్బందులను గిరిజనులు ఇక మరచిపోవచ్చని ఈపీడీసీఎల్ ఎస్ఈ సూర్యప్రకాశ్ అన్నారు. కృష్ణాదేవిపేటలో కాకరపాడుకు సబ్‌స్టేషన్‌కు వేసిన ప్రత్యేక విద్యుత్‌లైన్‌ను ఆయన ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఇక నుంచి కాకరపాడుకు కృష్ణాదేవిపేట నుంచి విద్యుత్ సరఫరా అవుతోందదన్నారు. ఏ కారణంతోనైనా విద్యుత్ నిలిచినా వెంటనే తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి నుంచి సరఫరా పొందవచ్చన్నారు. ప్రతీ గ్రామానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టామన్నారు. మన్యంలో విద్యుత్ లేని గ్రామాలు 126 ఉన్నాయన్నారు. వాటికి విద్యుత్ సౌకర్యం కోసం రూ.28 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. జి.మాడుగుల–చింతపల్లి మధ్య ప్రత్యేక లైన్ జి.మాడుగుల–చింతపల్లి మధ్య ప్రత్యేక లైన్ వేసేందుకు 36 కిలోమీట్లకు రూ.నాలుగు కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రతిపాదించినట్టు ఎస్ఈ చెప్పారు. దీనికి అనుమతి వస్తే పనులు ప్రారంభిస్తారన్నారు. ఈ లైన్ వేస్తే చింతపల్లికి కూడా విద్యుత్ సమస్య చాలా వరకు తొలగిపోతుందన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో కొన్నింటిని ప్రతిపాదించామన్నారు. రూ.వంద కోట్లతో 30 సబ్స్టేషన్లను నిర్మిస్తున్నట్టు చెప్పారు. వీటిలో ఎక్కువగా విశాఖ నగరంలో నిర్మాణం అవుతుండగా... నర్సీపట్నంలో కూడా ఒకటి నిర్మాణ దశలో ఉందన్నారు. లైన్మెన్ల నియామకానికి చర్యలు జిల్లాలో 550 మంది జూనియర్ లైన్మెన్లను నియమించేందుకు చర్యలు తీసుకున్నట్టు ఎస్ఈ సూర్యప్రకాశ్ చెప్పారు. త్వరలో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చన్నారు. వారు వస్తే సిబ్బంది కొరత తీరుతుందన్నారు. ప్రస్తుతానికి ఏఈల కొరత లేదన్నారు. వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఒకే ఫీడర్ ఉండాలని ప్రతిపాదించినట్టు వెల్లడించారు. దీనికిఅనుమతి వస్తే వారికి ప్రత్యేక ఫీడర్ ఇచ్చేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. అనంతరం ఆయన కాకరపాడు వరకు లైన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో డీఈ పి. ఆహ్మద్‌ఖాన్, ఏడీఈ లక్ష్మణరావు, నిర్మాణాల డీఈ టీఎస్ఎన్ మూర్తి, ఏడీఈ అప్పన్నబాబు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లీ వేదన!
సాక్షి, అనంతగిరి(అరకులోయ): ఏజెన్సీలో మారుమూల గ్రామాలకు రహదారి సదుపాయం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో వైద్యసేవలు పొందడానికి గిరిజనులు కాలినడకన, లేదా డోలీల్లో ఆస్పత్రులకు చేరుకోవలసి వస్తోంది. ఆస్పత్రులకు చేరే వరకు వారి ప్రాణాలు నిలు స్తాయన్న నమ్మకం ఉండడం లేదు. ఇలా తరలించే సమయంలో రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పాడేరు, అరకులోయ మండలాల్లో ఈ పరిస్థితి నిత్యం ఎదురవుతోంది. ఒకే కుటుంబా నికి చెందిన, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు యువకులను కుటుంబ సభ్యులు ఏడు కిలోమీటర్లు డోలీలో తరలించవలసి వచ్చింది. అనంతగిరి మండలం అనంతగిరి పంచాయతీ డెక్కపురం, హుకుంపేట మండలం పట్కదవడ గ్రామాలు సమీపంలో పక్కపక్కన ఉన్నాయి. వీటికి రహదారి సౌకర్యం లేదు. డెక్కపురానికి చెందిన గెమ్మలి విజయ్ అనే యువకుడు కొద్దిరోజులుగా మతిస్థిమితం లేక బాధపడుతున్నాడు. పట్కదవడ గ్రామానికి చెందిన గెమ్మెలి చంటి అనే యువకుడికి గుండెనొప్పి వచ్చింది. వీరి ఆరోగ్య పరిస్థితి సోమవారం క్షీణించింది. దీంతో ఆ గ్రామాల నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీపురం వరకు వారిని రెండు డోలీల్లో దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా మోసుకొచ్చారు. అక్కడి నుంచి ఆటోలో అనంతగిరి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవల కోసం చంటిని అరకులోయ ఏరియా ఆస్పత్రికి, విజయ్ను కేజీహెచ్‌కు తరలించారు. తాము ఈ బాధలు భరించలేకపోతున్నామని, అధికారులు స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలని ఆ రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
దశ తిరిగింది !
దశాబ్దాలుగా కనీస సౌకర్యాలకు నోచుకోని ఆ రెండు గ్రామాల దశ ఒక్క ఫోన్ కాల్‌తో మారబోతోంది. రావికమతం మండలం పశులబంద, జీలుగులోవ గిరిజన గ్రామాలకు రోడ్డు, విద్యుత్, మంచినీరు సౌకర్యాలు కల్పించాలని వచ్చిన వినతిపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఇటీవల సాక్షి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్‌తో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో కొంతమంది గిరిజనులు తమ సమస్యలను చెప్పుకున్నారు. స్పందించిన కలెక్టర్ ఆ రెండు గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ గ్రామాలను తహసీల్దార్ పి.కనకారావు, ఎంపీడీవో రామచంద్రరావు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు సందర్శించారు. విద్యుత్, తాగునీరు, రోడ్ల పనులకు శ్రీకారం చుట్టడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహారాణిపేట,(విశాఖ దక్షిణ): రావికమతం మండలం పశులబంద, జీలుగులోవ గిరిజన గ్రామాలు కొనేళ్ల వరకూ రెవెన్యూ రికార్డుల్లో లేవు. దీంతో అభివృద్ధి ఈ ఊర్లవైపు తొంగిచూలేదు. సుమారు మూడేళ్ల క్రితం రెవెన్యూ రికారుల్లో చేర్చినప్పటికీ పాలకులు పట్టించుకోలేదు. దీంతో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంత మంది పాలకులు వచ్చినా అభివృద్ధి ఆనవాళ్లు ఇక్కడ కనిపించలేదు. కళ్యాణపులోవకు ఆరు కిలో మీటర్ల దూరంలో సామాలమ్మ కొండల్లో పశులబంద, జీలుగులోవ గిరిజన గ్రామాలు ఉన్నాయి. విద్యుత్ సౌకర్యం లేదు. మంచినీరు దొరకదు. కనీసం రోడ్డు కూడా లేదు. ఈ గ్రామాల్లో 18 గిరిజన కుటుంబాలుండగా (కోందు తెగ).. 50 మందికి పైగా జీవిస్తున్నారు. అడవిలో పండే వాటినే తింటూ.. కొండకోనల్లో అడవి జంతువులు, క్రిమికీటకాల మధ్య జీవనం సాగిస్తున్నారు. ఓటు హక్కులేదు. రేషన్, ఆధార్‌కార్డులకు నోచుకోలేదు. వీరు ఏ మండలంలో ఉన్నారో..ఏ పంచాయతీకి చెందిన గుర్తింపు లేకుండా పోయింది. ఎలాంటి ప్రభుత్వపథకాలు అందడం లేదు. విద్యుత్ సరఫరా లేక చీకట్లో అవస్థలు పడుతున్నారు. కట్టెలను వెలిగించి వచ్చే వెలుతురులో రాత్రి భోజనం చేసి నిద్రలోకి జారుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న జీసీసీ గతంలో ఓ సారి రెండు గ్రామల గిరిజనులకు కిరోసిన్ సరఫరా చేసింది. తరువాత ఆ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఓ స్వచ్ఛంద సేవాసంస్థ సహకారంతో గ్రావిటీ పథకం ఏర్పాటు చేసి కుళాయి ద్వారా నీరు సరఫరా చేశారు. ప్రస్తుతం అది కూడా పాడైంది. దీంతో గెడ్డలో ఊరే నీటిని తెచ్చుకొని అవసరాలు తీర్చుకుంటున్నారు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో అత్యవసర సమయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు కూడా జరగడం లేదు. జీసీసీ కూడా ఈ గ్రామాలవైపు పూర్తిస్థాయిలో కన్నెత్తి చూడలేదు. ఈ పరిస్థితిలో ఇటీవల కలెక్టర్ వినయ్‌చంద్‌తో సాక్షి నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమలో పాల్గొన్న కొంతమంది గిరిజన సంఘ నాయకులు ఈ గ్రామాల దుస్థితిని చెప్పారు. తక్షణమే స్పందించిన ఆయన గ్రామాలకు వెళ్లి పరిస్థితిని చూడమని ఆదేశించారు. దీంతో రావికమతం తహసీల్దార్ పి.కనకారావు, ఎంపీడీవో రామచంద్రరావు, విద్యుత్ శాఖ అధికారులు పశులబంద, జీలుగులోవ గ్రామాలను సందర్శించారు. విద్యుత్, రోడ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఆదుకోండి.. అడవిని నమ్ముకొని జీవిస్తున్నాం. కనీస సౌకర్యాలు లేవు. తాగడానికి నీరు లేదు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదు. తాగునీరు, విద్యుత్ సరఫరా చేయాలి. రోడ్డు వేయాలి. కొర్రగాసి, పశువులబంద ఏ మండలంలో ఉన్నాయో? పశులబండ, జీలుగులో గిరిజన గ్రామాలు ఏ మండలంలో ఉన్నాయో కూడా తెలియడం లేదు. రావికమతం అని చెబుతున్నా ఆ మండల అధికారులు మా వైపు చూడడం లేదు. ఏమైనా ఆధారం ఉందా అని అడుతున్నారు. సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్‌చంద్‌తో మాట్లాడే అవకాశం కలిగింది. తమకు ఎంతో ఆనందం కలిగింది. విద్యుత్, తాగునీరు, రహదారులు లేవని చెప్పాం. కలెక్టర్ స్పందించారు. సాక్షికి కృతజ్ఞతలు. – కె.గోవిందరావు, మైదాన ప్రాంత గిరిజన సంఘం జిల్లా కన్వీనర్ -
జల దిగ్భంధనంలోనే గిరిజన గ్రామాలు
సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరంలో వరద ఉధృతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం నీటిమట్టం 26 అడుగులుగా కొనసాగుతోంది. ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రహదారులపై వరద నీరు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.19 గిరిజన గ్రామాలు తొమ్మిది రోజులుగా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. తుంగభద్ర జలాశయానికి వరద నీరు కర్నూలు: తుంగభద్ర జలాశయానికి వరద నీరు చేరుతుంది. పూర్తిస్థాయి నిల్వ 100 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 36 టీఎంసీలకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 23,052 క్యుసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 1230 క్యుసెక్కులు ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతుంది.ప్రస్తుతం నీటిమట్టం 866.60 అడుగులు కొనసాగుతుంది. ఇన్‌ఫ్లో 2,55,779 టీఎంసీలు ఉండగా, ఔట్ ఫ్లో 50,880 క్యుసెక్కులుగా ఉంది. -
గిరిజనులను ముంచిన కాఫర్ డ్యామ్
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: నిపుణుల మాటలను పెడచెవిన పెట్టి చంద్రబాబు సర్కార్ నిర్మించిన కాఫర్ డ్యామ్ గిరిజనుల ‘కొంప’ ముంచింది. అదే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో మన్యం వాసులు నిద్రలేని రాత్రులు గడిపే స్థితికి కారణమైంది. కాఫర్ డ్యామ్ నిర్మాణంతో సమీప గ్రామాల్లో ప్రజలు వరద ముంపులో చిక్కుకుంటారని తెలిసినా నాటి ప్రభుత్వం కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం డ్యామ్‌కు సమీపాన ఉన్న దేవీపట్నం నుంచి కూనవరం మండలం వరకూ ఉన్న సుమారు ఐదు వేల కుటుంబాలు గోదావరి వరద ముంపునకు గురయ్యాయి. కాఫర్ డ్యామ్‌ను ఒక క్రమ పద్ధతిలో నిర్మించి ఉంటే ఇంతటి వరదను ఎదుర్కోవాల్సిన అగత్యం ఏర్పడేదే కాదు. అటు పశ్చిమ గోదావరి జిల్లా పైడిపాక నుంచి ఇటు తూర్పుగోదావరి జిల్లా పోసమ్మగండి వరకూ 1800 మీటర్ల పొడవు, 2400 మీటర్ల వెడల్పుతో కాఫర్ డ్యామ్‌ను నిర్మించారు. ఈ డ్యామ్‌కు రెండు వైపులా 300 మీటర్లు వంతున ఖాళీగా వదిలేశారు. ఏటా గోదావరికి ఆగస్టు వచ్చేసరికి వరదలు వస్తాయని తెలిసి కూడా ముందస్తు అంచనాలు లేకుండా చంద్రబాబు సర్కార్ డ్యామ్ నిర్మాణం చేపట్టింది. కాఫర్ డ్యామ్ నిర్మించే ముందు కనీసం నిర్వాసితులకు రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ (ఆర్అండ్ఆర్) ప్యాకేజీ అందజేసి కాలనీలు నిర్మించి ఉంటే ఇప్పుడు ఇంతటి విపత్కర పరిస్థితి ఎదురయ్యేది కాదు. వాస్తవానికి భద్రాచలం వద్ద గోదావరి 53 అడుగులకు చేరుకుని మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పుడు మాత్రమే ఈ గిరిజన గ్రామాలు వరద ముంపునకు గురవుతాయి. కానీ ప్రస్తుతం భద్రాచలం వద్ద 46 అడుగులతో మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రమే జారీ చేశారు. అంటే.. వరద ముంపు ఈ గిరిజన గ్రామాలకు ఉండకూడదు. 48 అడుగులతో ఉన్నప్పుడు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే 30 గ్రామాలు, 53 అడుగులతో ఉన్నప్పుడు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే గిరిజన గ్రామాలన్నీ వరద నీటిలో మునిగిపోతాయి. గోదావరికి భారీగా వరదలు వచ్చి భద్రాచలం వద్ద మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన 1953, 1986, 2006, 2013లలో మాత్రమే ఈ గిరిజన గ్రామాలు నీట మునిగాయి. కానీ ఇప్పుడు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసే సరికే గిరిజన గ్రామాలన్నీ జలదిగ్బంధానికి గురయ్యాయి. ఇదంతా కాఫర్ డ్యామ్ నిర్మాణంతో ఎదురైన వరద ఉధృతేనని అధికారులే చెబుతున్నారు. -
కల నెరవేరేనా?
సాక్షి, పలాస(శ్రీకాకుళం) : నియోజకవర్గంలోని పలు గిరిజన గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మారుమూల గ్రామాల్లో కనీస సదుపాయాలు లేవు. కొన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రక్షిత మంచినీటి పథకాలు మొరాయించడంతో ఎండమావిగానే మిగిలిపోతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న నిరుద్యోగంతో యువకులు నిర్వీర్యం చెందుతున్నారు. పలాస, మందస మండలాల్లో గిరిజన గ్రామాలు ఉన్నాయి. తర్లాకోట, లొత్తూరు తదితర గిరిజన గ్రామాలన్నీ పలాస మండల కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కొఠారింగ్ తాళభద్ర, పెదగంతరు, చినగంతరు, చింతగట్టువూరు తదితర గ్రామాలకు సరైన రహదారి సదుపాయాలు లేవు. దీంతో ప్రభుత్వ పథకాలకు సక్రమంగా నోచుకోలేకపోతున్నారు. ఆయా గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో కలపాలని ఈ ప్రాంత గిరిజనులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అభివృద్ధి జరగకపోవడానికి ఇదే ఆటంకమని స్థానిక ప్రజలు చెబుతున్నారు. అటవీ ఉత్పత్తులు సేకరించి పట్టణానికి తీసుకురావడానికి రవాణా సదుపాయాలు లేవు. మందస మండలంలోని కొండలోగాం, టంగరిపుట్టుగ, రాయికోల, నర్సింగపురం, కుశమాలి, బౌంసుగాం, రామరాయి, అడవికొత్తూరు, మొగిలిపాడు తదితర గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. మందస మండలంలో మొత్తం 189 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు వైద్య, విద్య, మంచినీరు, విద్యుత్తు సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా రహదారి సమస్య వీరిని వెంటాడుతుంది. గిరిజన గ్రామాల్లోని ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు నామమాత్రంగానే పనిచేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలం గ్రామాలు జనాభా పలాస 26 6 వేలు మందస 189 35 వేలు ఈ గ్రామాలకు రహదారి సదుపాయాలు కల్పించి విద్య, వైద్యం అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నా గత పాలకులు పట్టించుకోలేదు. ఈ గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారు వందల సంఖ్యలో ఉన్నారు. క్షయ, మలేరియా వంటి వ్యాధులు కూడా వీరిని పట్టిపీడుస్తున్నాయి. కొండల మీద, లోయల వద్ద గుడిసెల్లోనే ఇంకా జీవనం సాగిస్తున్నారు. సరైనా గృహాలు కూడా లేవు. గత ప్రభుత్వం మంజూరు చేసిన చోట గృహాలు అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైన తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు షెడ్యూల్డ్ ఏరియాలోకి విలీనం చేయాలని గిరిజనులు కోరుతున్నారు. షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించాలి పలాస నియోజకవర్గంలోని గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలి. నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉండటం వల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నాం. బీఈడీ, డీఈడీ చదివి పేర్లు నమోదు చేసుకున్న వారు 1800 మంది ఉన్నారు. వారికి ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం లేదు. – సవర జగన్నాయకులు, టీచరు, కొంకడాపుట్టి, మందస మండలం రోడ్డు సదుపాయాలు కావాలి గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయాలు కావాలి. రోడ్లు లేకపోవడం వల్ల అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. వ్యాధుల బారిన పడుతున్నా బయటకు వెళ్లలేక సంచి వైద్యుల చేత వైద్యం చేయించుకుంటున్నాం. మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. – సవర చిన్నారావు, కొఠారింగ్ తాళభద్ర, పలాస మండలం -
ఓటేయాలంటే ఒక రోజు ముందే కొండలు దిగాలి!
నాతవరం (నర్సీపట్నం) : విశాఖ జిల్లాలోని గిరిజన గ్రామాల ప్రజలు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేయాలంటే కొండలు దాటి సుమారు 10 కిలోమీటర్ల దూరం నడవాలి. నాతవరం మండలంలో 27 గ్రామ పంచాయతీల్లో 82 శివారు గ్రామాలు ఉన్నాయి. వీటిలో 16 గ్రామాలు గోదావరి జిల్లాల సరిహద్దులో కొండల మీద ఉన్నాయి. వారు ఓటు వేసేందుకు అధికారులు 65 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొండల మీద ఉన్న గ్రామాల గిరిజనులు ముందు రోజు కొండల పైన నుంచి నడిచి రాత్రికి సరుగుడు గ్రామంలో నిద్ర చేసి మరుసటి రోజున ఓటు వేసి తమ ఇంటికి వెళ్తుంటారు. వృద్ధుల్లో చాలామంది కొండల పై నుంచి నడిచి రాలేక ఓటు వేయడానికి వెనుకంజ వేస్తున్నారు. సరుగుడు గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ 3,800 మంది గిరిజనులు ఓట్లు వేస్తారు. పోలింగ్ కేంద్రానికి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో కొండలపైన సుందరకోట అసనగిరి, తోరడ, బమ్మిడికలొద్దు, కొత్త సిరిపురం, ముంతమామిడిలొద్దు, కొత్త లంకల గ్రామాలు ఉన్నాయి. కొండల దిగువ ప్రాంతాల్లో యరకంపేట, రాజవరం, మాసంపల్లి, దద్దుగుల, రామన్నపాలెం, అచ్చంపేట గ్రామాలు పోలింగ్ కేంద్రానికి 2 నుంచి 4 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. దీంతో ఈ గ్రామాల ప్రజలు కూడా ఓటు వేయాలంటే నడిచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. కలిసొచ్చిన క్రాస్ ఓటింగ్ 2009 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ పరిధిలో క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్‌ను ఒడ్డెక్కించింది. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు, ఒకచోట పీఆర్పీ అభ్యర్థి గెలుపొందినా, లోక్‌సభకు వచ్చేసరికి జరిగిన క్రాస్ ఓటింగ్ ఆయనకు కలిసొచ్చింది. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నుంచి టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా, తిరుపతి నుంచి పీఆర్పీ అభ్యర్థి చిరంజీవి గెలుపొందారు. కాంగ్రెస్ సర్వేపల్లి నుంచి మాత్రమే విజయం సాధించింది. అయితే లోక్‌సభకు వచ్చేసరికి చింతామోహన్ 18,059 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. -
ప్రగతి వెలుగులేవీ?
వాజేడు: అడవి బిడ్డలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్ ఇలా కనీస వసతులకు నోచుకోలేక ఆదివాసీలు పడరాని పాట్లు పడుతున్నారు. వీరిని కేవలం జనాభా లెక్కలు, ఓట్ల కోసమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు దాటినా వీరి తలరాతలు ఇంకా మారలేదు. వాజేడు మండల పరిధిలోని కొంగాల గ్రామ పంచాయతీలో ఉన్న ఓ కుగ్రామం పెనుగోలు. వాజేడు నుంచి ఈ గ్రామం 18 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి వెళ్లాలంటే రాళ్ల దారిని దాటాల్సిందే.. ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. ఇక్కడ గతంలో 50 కుటుంబాలు, 200 మంది జనాభా ఉండేది. గుట్టలు దిగిరావాలని అధికారులు పెట్టిన ఒత్తిడి కారణంగా తమ స్వేచ్ఛా జీవితాన్ని వదిలి 25 కుటుంబాల వారు వాజేడు సమీపంలోకి వచ్చి నివాసముంటున్నారు. మిగిలినవారు పెనుగోలులోనే అభివృద్ధికి ఆమడ దూరంలో మగ్గుతున్నారు. కానరాని రహదారులు పెనుగోలుకు వెళ్లడానికి రోడ్డు లేకపోవడంతో రాళ్ల దారిలో వాగులను దాటాల్సి ఉంటుంది. గ్రామస్తులు రేషన్ సరుకులు తీసుకోవడానికి సైతం గుమ్మడి దొడ్డికి రావాల్సి ఉంటుంది. ఏ పనికైనా గుట్టలు దిగి రాళ్ల దారి, చెట్లు పుట్టలు, వాగులు వంకలు దాటుకుంటూ రావాల్సిందే.. తాగునీరు లభించదు.. ఈ గ్రామానికి తాగునీటి వనరులు వాగులు, ఓ బావి మాత్రమే. బావిలోని నీరు పచ్చబడి ప్రమాదకరంగా ఉంటుంది. సమీపంలో ఉన్న పాల వాగు, నల్ల వాగుల్లో నీటిని వినియోగిస్తున్నారు. అధికారులు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. పెనుగోలు గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేదు. గతంలో రెండు పర్యాయాలు సోలార్ సిస్టం ద్వారా విద్యుత్‌ను అందించేందుకు సర్వేలను నిర్వహించి మూడో విడతలో ఏర్పాటు చేశారు. కానీ అది పూర్తిస్థాయిలో ఆచరణలోకి రాలేదు. దీంతో స్వాతంత్రం వచ్చి 68 ఏళ్లు దాటినా గుట్టలపై ఉన్న గిరిజనులు మాత్రం గుడ్డి దీపాలతోనే జీవనం సాగిస్తున్నారు. వైద్యం అందని ద్రాక్షే.. అడవిబిడ్డలకు ఏ రోగం, రొప్పి వచ్చినా సరైన వైద్యం అందదు. గుట్టల పై ఉన్న పెనుగోలుకు ప్రభుత్వ వైద్యులు వెళ్లరు. కేవలం ఒక ఏఎన్ఎం మాత్రం వెళ్లి వస్తుంటుంది. జ్వరమొచ్చినా, నొప్పి వచ్చినా రోగులు కిందకు రావాల్సిందే.. చికిత్స కోసం రోగులను గుట్టలు దింపి వాజేడు, వెంకటాపురం, భద్రాచలం, వరంగల్‌లోని ఆస్పత్రులకు పంపిస్తున్నారు. ఆస్పత్రికి రోగులను తీసుకురావాలంటే నడిం కావడి ద్వారా ఇద్దరు వ్యక్తులు మోసుకొస్తుంటారు. వైద్యశాలకు చేరితే రోగి ప్రాణాలు దక్కినట్లు. లేకపోతే అంతే.. ఇలా వైద్యం అందక పలువురి ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయి. అధికారులు మాత్రం సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. మంజూరు కాని ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతీ పథకానికి నిజమైన లబ్ధిదారులు పెనుగోలు గిరిజనులు. కానీ వారికి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఒక్కటీ అందడం లేదు. వీరికి ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటికీ లభించలేదు గిరిజనుల కోసం ఏర్పడిన భద్రాచలం ఐటీడీఏ నుంచి పెనుగోలు గిరిజనులకు అందిన సహాయం ఏ మాత్రం లేదు. గుట్టపై ఉన్న అడవిబిడ్డలకు పోడు వ్యవసాయమే దిక్కు. అది కూడా వర్షాలు పడితే పండినట్టు లేక పోతే ఎండినట్టు. ఆధునిక వ్యవసాయం చేసే అవకాశం ఏమాత్రం లేదు. ఎరువులు, పురుగు మందులు తీసుకెళ్లే దారి లేదు. దీంతో పోడు వ్యవసాయం చేసి పండిన పంటను అందరూ తింటారు. ముఖ్యంగా జొన్న, సజ్జలను పండిస్తారు. వాటితో పాటు తేనె సేకరించి విక్రయిస్తారు. తమకు అడవిలో దొరికే వెదురుతో గుమ్ములు, బుట్టలు, తడకలు, కోళ్ల గూళ్లు, చాటలు చేసి విక్రయిస్తుంటారు. మరోవైపు ఇక్కడి గిరిజన విద్యార్థులకు పాఠశాల ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు లేడు. ప్రభుత్వం స్పందించి గ్రామస్తులకు మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. -
ఇంకా చీకట్లోనే..
సీతంపేట: గిరిజన బతుకులు ఇంకా చీకట్లోనే మగ్గిపోతున్నాయి. వీరికి వెలుగు అందించడానికి సర్కారు చెప్పిన సోలార్ కథ కంచికి చేరేలా కనిపిస్తోంది. గిరిజన గ్రామాల్లో గతంలో వేసిన సోలార్ లైట్లు దాదాపుగా పాడైపోయాయి. వీటిని పట్టించుకునే వారే లేకపోవడంతో గిరిజన గూడల్లో చీకట్లు అలముకుం టున్నాయి. కొండలపై ఉన్న గ్రామాలతో పాటు కొండ దిగువన ఉన్న గ్రామాల్లో సైతం చాలా లైట్లు వెలగడం లేదు. ఈ దీపాలు వేసిన కొద్ది రోజుల వరకు మాత్రమే వెలిగాయి. దీంతో రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సదుపాయం ఉన్నా వీధి లైట్లు లేని గ్రామాలకు, కొండలపై ఉన్న గ్రామాలకు సౌర విద్యుత్ అందించాలనే లక్ష్యంతో మూడేళ్ల కిందట నెడ్‌క్యాప్ సంస్థ ద్వారా 325, ప్రైవేట్‌గా మరో 250 సోలార్ దీపాలు దాదాపు వంద గ్రామాల వరకు ఇచ్చారు. ఒక్కో గ్రామంలో రెండు, మూడు లైట్ల వరకు వేశారు. రాత్రి వేళ అడవి జంతువుల భయం ఉండకుండా ఈ ఏర్పాట్లు చేశారు. విద్యుత్ సరఫరాతో సంబంధం లేకుండా ఇవి వెలుగుతాయి కాబట్టి వీటిని కొండలపై ఏర్పాటు చేశారు. అలాగే ఏనుగుల ప్రభావిత గ్రామాలకు కూడా పంపిణీ చేశారు. ఈ గ్రామాల్లో ఎక్కువగానే దీపాలు ఇచ్చారు. ఒక్కో దీపం ఖరీదు రూ.18,400 వరకు ఉంటుంది. ఇలా కోటి రూపాయల వరకు వెచ్చించారు. అయితే ఈ దీపాల్లో 50 శాతం వెలగడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవి జంతువులతో కష్టాలే ఆడవి జంతువులతో గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు. ఈ సీజన్లో అడవి పందులు వంటివి ఎక్కువగా తిరుగుతుంటాయి. దీంతో గిరిజనులు భయాం దోళనలు చెందుతున్నారు. ఏనుగుల ప్రభావిత గ్రామాల్లో కూడా వేసిన లైట్లు సైతం వెలగడం లేదు. వాస్తవానికి ఏనుగులు లైటింగ్ ఎక్కువగా ఉంటే గ్రామాలకు వచ్చే అవకాశాలు తక్కువ. అయితే చాలా గ్రామాల్లో లైట్లు వెలగకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలీని పరిస్థితి ఉంది. పర్యవేక్షణ లేకనే.. సోలార్ లైట్లు వినియోగించాలంటే ప్రతి రెండునెలలకొక మారు ఈ సోలార్ లైట్లకు ఉండే బ్యాటరీల్లో డిస్టల్ వాటర్ వేయాలి. అలాగే బ్యాటరీ పోకుండా జెల్లీ పది గ్రాముల వరకు బ్యాటరీకి రాయాలి. అలాంటి మెయింటెనెన్స్లు ఏవీ చేయకపోవడంతో సోలార్ లైట్లు కొన్ని మొరాయించగా మరికొన్ని చోట్ల మిణుకుమిణుకుమంటూ వెలుగుతున్నాయని గిరిజ నులు చెబుతున్నారు. నాలుగేళ్లుగా ఎలాంటి డిస్టల్ వాటర్, జెల్లి వంటివి పెట్టకపోవడంతో కొన్ని సోలార్ లైట్లకు అయితే బ్యాటరీలు కూడా పోయి ఉంటాయని పలువురు మెకానిక్‌లు తెలియజేస్తున్నారు. అయితే వీటి మెయింటెనెన్స్‌కు గతంలో ఇద్దరిని కూడా నియమించారు. వారికి అవసరమైన టూల్కిట్లు వంటివి లేకపోవడంతో వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు. నెడ్‌క్యాప్ అధికారులు బ్యాటరీలు ఎత్తుకుపోయారని, తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. -
పల్లెకు దారేదీ?
అనంతపురం సిటీ: అభివృద్ధికి రాచ బాటలు రహదారులు. అలాంటి రహదారులు లేని ప్రాంతాలు అభివృద్ధికి ఆమడదూరమనడంలో ఎలాంటి సందేహం లేదు. రహదారులులేని గ్రామాలు జిల్లాలో కోకొళ్లలు. రహదారులు సరిగా లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల స్వార్థం రహదారుల నిర్మాణాల్లో అధికారుల నిర్లక్ష్యం, పాలకుల స్వార్థం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొందరు నేతలు రహదారుల కాంట్రాక్టులు తమకే దక్కేలా చక్రం తిప్పుతున్నారు. ఇందుకోసం అధికారులతో అప్పటికప్పుడు ప్రణాళికలను సిద్ధం చేసి ఎంతకి కోట్ చేయాలో కూడా వారే చెబుతున్నారు. ఇక... నాణ్యతకు తిలోదకాలిచ్చి డబ్బులు దండుకోవడమే పరమావధిగా వాటిని నిర్మాణాలను మమ అనిపిస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులు బరితెగించి వేసిన రోడ్లపైనే మళ్లీ రోడ్లు వేస్తున్నారు. కాంట్రాక్టర్లపై చర్యలేవీ? రహదారుల నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలిచ్చినా ఆయా శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. నేతల ఒత్తిడుందని, తప్పని పరిస్థితి అంటూ తప్పుకునే పద్ధతులను ఎంచుకుంటున్నారు. ఫలితంగా జరిగిన తప్పే మరోసారి జరుగుతోంది. గుత్తి, బ్రహ్మసముద్రం, కంబదూరు, యల్లనూరు ప్రాంతాల్లో చివరికి ప్యాచ్ వర్కులు కూడా చేయకుండా ఒక్కో రహదారికి రూ.20 నుంచి రూ.24 లక్షలను ఆ శాఖ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దండుకున్నట్లు ఆరోపణలున్నాయి. వీటిపై ఇప్పటికే విచారణ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నాణ్యతతో కూడిన నిర్మాణాల కోసం అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారా? లేక నామ మాత్రపు విచారణల పేరుతో కాలయాపన చేస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మచ్చుకు కొన్ని... ♦ పెనుకొండ నుంచి చిన్నపరెడ్డిపల్లి, మోట్రాపల్లి, శెట్టిపల్లి, అడదాకులపల్లి గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్డు 20 ఏళ్లక్రితం వేశారు. రహదారి సరిగా లేకపోవడంతో ఆయా గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. ప్రమాదాలు జరుగుతున్నా ఆటోల్లోనే వెళ్లాల్సి వస్తోంది. ♦ లేపాక్షి పరిధిలోని మద్దిపి గ్రామానికి వెళ్లే రహదారి చాలా అధ్వానంగా ఉంది. ఈ రహదారికి సంబంధించిన ప్రణాళికను అప్పట్లో అధికారులు ప్రభుత్వానికి పంపారు. అనంతరం వారు పట్టించుకోకపోవడంతో అనుమతులు లభించలేదని తెలిసింది. ♦ కూడేరు పరిధిలోని పి.నారాయణపురం, కరుట్లపల్లి, కడదరకుంట గ్రామాలకు వెళ్లే రహదారి గుంతలమయమైంది. నాసిరకంగా పనులు చేయడంతో ఈ రహదారి ఏ మాత్రం ప్రయాణానికి అనుకూలంగా లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. మేం మనుషులు కాదా? ఐపార్సుపల్లి గ్రామస్తులను పాలకులు మనుషులుగా గుర్తించడం లేదు. 15 ఏళ్ల క్రితం రహదారి నిర్మాణం కోసం కంకరతోలి వదిలి పెట్టారు. ఇప్పటి దాకా రోడ్డు వేయక పోవడంతో ఉన్న రోడ్డు పాడయిపోయి ఆర్టీసీ సంస్థ బస్సులను కూడా గ్రామానికి నడపడం మానేసింది. మేం పడుతున్న బాధలు ఎవరికీ పట్టడం లేదు.– సూరేనాయక్, ఐపార్సుపల్లి -
కాబోయే అమ్మ.. కష్టాల ‘జన్మ’
కనబోయే బిడ్డ గురించి కలలు లేవు. కడుపులో కదులుతున్న చిరుప్రాణం గురించి ఊహలు లేవు. ఉన్నదంతా భయమే. శిశువు చిట్టి కాలితో తంతూ ఉంటే భయం.. బిడ్డ ఎలా బయటకు వస్తుందోనని. బుజ్జాయి కడుపు చుట్టూరా కదులుతూ ఉంటే తెలీని ఆందోళన.. ప్రసవ సమయం ఎలా గడుస్తుందోనని. గడప దాటి బయటకు చూసిన ప్రతిసారీ కంగారు.. ఈ రోడ్డు మీద నుంచే ప్రసవానికి వెళ్లాలి కదా అని. గిరిజన గూడల్లో కాబోయే అమ్మ శిశువు జన్మను తలచుకుని కన్నీరు పెడుతోంది. ఆనందంగా గడపాల్సిన సమయంలో ఆందోళన చెందుతోంది. ఆస్పత్రికి వెళ్లేందుకు దారులు లేక, బర్త్ వెయిటింగ్ రూముల్లో చేరే దారి తెలీక గిరిజన గర్భిణులు నరక యాతన అనుభవిస్తున్నారు. మందస నుంచి సీతంపేట శివార్ల వరకు వందలాది గ్రామాల్లో ఈ విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సీతంపేట: కొద్ది నెలల కిందట జగ్గడుగూడ గ్రామానికి చెందిన ఓ గర్భిణిని ప్రసవం కోసం డోలీలో మోసుకువెళ్లాల్సి వచ్చింది. కొంత దూరం మోసుకుంటూ వెళ్లాక 108 వచ్చింది. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె అక్కడే ప్రసవించింది. వాహనంలో సిబ్బంది చొరవ చూసి సపర్యలు చేయడంతో తల్లీబిడ్డా బతకగలిగారు. అంతకుముందు వెలగాపురం గ్రామానికి చెందిన మరో గర్భిణి సకాలంలో అంబులెన్స్ రాక చనిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు గతంలో గాల్లో కలిసిపోయాయి. అయినా ఇప్పటికీ డోలీ పట్టనిదే గిరిజ న గర్భిణి గ్రామం దాటలేకపోతోంది. గిరి శిఖర గ్రామాల్లో రహదారి సదుపాయం లేకపోవడంతో వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 108తో పాటు ఐటీడీఏ ఏర్పాటు చే సిన అంబులెన్స్‌లు కూడా కొండలపైకి వెళ్లలేకపోవడంతో బిడ్డకు జన్మనివ్వాల్సిన సమయంలోనే తల్లులు తనువు చాలిస్తున్నారు. ప్రగతి ‘దారులు’ కరువు ట్రైబుల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో రహదారులు లేని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పని చేయడం లేదు. గ్రామాలకు రహదారులు మంజూరు కాకపోవడం, మం జూరైన రహదారుల పనులు పూర్తి కాకపోవడం, కొన్ని గ్రామాలు పూర్తిగా సర్వేకు నోచుకోకపోవడం వంటి కారణాలతో ఇబ్బందులు తప్ప డం లేదు. సీతంపేట మండలంలోని సన్నంనాయుడుగూడ, ఈతమానుగూడ, ఎగువబుడగరాయి, జన్నోడుగూడ, పెద్దగూడ, జోగైనాయుడుగూడ, గాం«ధీగూడ, చాకలిగూడ, బొమ్మిక, పాతచాకలి గూడ, చీపురుగూడ, సరిహద్దుగూడ ఇలా చాలా గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు.ఐటీడీఏ పరిధిలో 1200ల గ్రామాలుండగా వీటిలో 400ల గ్రామాల వరకు రహదారులు లేవని అధికారిక అంచనా. కొండలపై గల గ్రా మాలు వీటిలో 50 వరకు ఉంటాయి. వీటితోనే గిరిజనులు అవస్థలు పడుతున్నారు. అలాగే సుమారు 2500 మంది గర్భిణులు ఉండగా వీరిలో దాదాపు 700 మంది వరకు కొండ శిఖర గ్రామాల్లో ఉన్నట్లు సమాచారం. బర్త్ వెయిటింగ్‌కు ససేమిరా సీతంపేట, కొత్తూరు, మెళియాపుట్టి, పాతపట్నం, మందస పీహెచ్‌సీల పరిధిలో గర్భిణులు ప్రసవానికి పది రోజుల ముందు బర్త్ వెయిటింగ్ రూముల్లో ఉండాలి. వారిని భోజనం, ఇతర సౌకర్యాలను ఆరోగ్య శాఖే కల్పిస్తుంది. రహదారి సౌకర్యం లేని గ్రామాల ప్రజలకు ఇక్కడ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ దీనిపై గిరిజనులు నమ్మకం పెట్టుకోలేకపోతున్నారు. పలు చోట్ల అవగాహన లేక, ఇంకొన్ని చోట్ల అర్థం కాక అమాయక గిరిజన ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పురుటి నొప్పులు వచ్చినప్పుడే మోసుకుని రోడ్డు ప్రాంతం వరకు తీసుకువచ్చి అక్కడ నుంచి అంబులెన్స్ ఎక్కిస్తున్నారు. ఈ లోగా ప్రాణాలు దక్కితే ఫర్వాలేదు. లేకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిన పరి స్థితి ఉంది. ఈ విషయమై డీఈఈ సింహాచలం వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా రహదారుల నిర్మాణానికి సర్వే చేయడం జరిగిందన్నారు. మూడు, నాలుగు కుటుంబాలు కూడా కొండలపై ఆవాసమేర్పరుచుకొనడంతో రహదారుల నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. రహదారులు పూర్తయితేనే సమస్య పరిష్కారం రహదారులు అన్ని గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి. గతంలో ఈ రహదారుల విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అలాగే ఐటీడీఏ దర్బార్‌లో కూడా వినతులు సమర్పించాం. వీలైనంత త్వరగా మంజూరైన రోడ్ల పనులు పూర్తి చేయాలి. మరమ్మతులకు గురైన రోడ్లను కూడా బాగుచేయాలి. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే రూముల్లో చేరడం లేదు గర్భిణులకు ఎలాంటి ఇ బ్బందులు లేకుండా బర్త్ వెయిటింగ్ రూముల్లో ఉంచి వారికి వైద్య సేవలు అందించేలా పీహెచ్‌సీల్లో ఏర్పాట్లు చేశాం. ఎంత చైతన్యం చేసినా వారు ఇక్కడకు రావడం లేదు. ఇక్కడకు వచ్చేస్తే కూలి గిట్టుబాటుకాదని, ఇంటి వద్ద మిగతా వారిని ఎవరు చూస్తారని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. – ఈఎన్‌వీ నరేష్కుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ, సీతంపేట -
గిరిజన గ్రామాల్లో కలెక్టర్ పర్యటన
విజయనగరం: విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని గిరిజన గ్రామాలైన కొత్తవలస, గండ్రాపు వలస గ్రామాల్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పర్యటించారు. విద్యార్థులు జ్వరాల బారినపడిన కొత్తవలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఆయన పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణపై తనిఖీలు నిర్వహించారు. ఇటీవల దిగువ గంజాయిగూడలో జ్వరంతో మరణించిన బాలిక కుటుంబానికి ఐదువేల ఆర్థిక సహాయం అందించారు. గండ్రాపువాలసలో మలేరియా నియంత్రణకు చేస్తున్న స్ప్రేయింగ్ ను పరిశీలించారు. జిల్లాలో 55 మంది వైద్యాధికారుల్ని తక్షణమే నియమించనున్నట్లు తెలిపారు. -
నడక యాతన
పార్వతీపురం రూరల్: మండలంలోని పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు చేసేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మారుమూల గ్రామాలకు సైతం పక్కా రహదారులు నిర్మించామని పాలకులు, అధికారులు గొప్పలు చెప్పుకుంటున్నా నేటికీ రహదారి సౌకర్యాలు లేని గ్రామాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో స్థానికులు రాకపోకలు సాగించాలంటే గోతులమయమైన రాళ్లు తేలిన రహదారులపైనే ప్రయాణించాల్సి వస్తోంది. గతంలో వేసిన మెటల్ రోడ్లు, మధ్య మధ్యలో గెడ్డలపై నిర్మించిన చిన్న చిన్న కల్వర్టులు శిథిలావస్థకు చేరి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగజేస్తున్నాయి. వేసవికాలంలోనే ఇలా ఉంటే వర్షాకాలంలో ఈ రహదారుల మధ్యలో నిర్మించిన వంతెనలపై రాకపోకలు చేయాలంటేనే నరకాన్ని తలపించినట్లవుతుంది. ఈ విధంగా మండలంలోని బుదురువాడ పంచాయతీ బిత్రటొంకి, గోచెక్క పంచాయతీ లిడికివలస, డోకిశీల పంచాయతీ మెల్లికవలస, డెప్పివలస, గంజిగెడ్డ, సరాయివలస, ములగ పంచాయతీ పిండిలోవ, బిల్లగుడ్డివలస గ్రామాలకు నేటికీ పక్కా రహదారులు లేక రాళ్లుతేలిన రహదారులపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు దృష్టిసారించి ఆయాగ్రామాలకు పక్కా రహదారులు నిర్మించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. రాకపోకలు చేయలేకపోతున్నాం ప్రతినిత్యం డోకిశీలకు రావాలంటే రాళ్లు తేలిన రహదారిపైనే ప్రయాణించాల్సివస్తుంది. ఏళ్లు గడుస్తున్నా తమ గ్రామానికి రహదారి కష్టాలు తప్పడం లేదు. మెల్లిక ఫిలిప్, గంజిగెడ్డగిరిజనులంటే చులకన ఈ ప్రభుత్వానికి గిరిజనులంటే చులకన భావం. మారుమూల గ్రామాలకు సైతం పక్కా రహదారులు నిర్మిస్తామని చెబుతున్నా హామీలు ప్రకటనలవరకే పరిమితమవుతున్నాయి. కార్యరూపం దాల్చడం లేదు. మెల్లిక రాజు, గంజిగెడ్డ