హీరాఖండ్‌ ఘటనపై ఎన్‌ఐఏ విచారణ | NIA enquiry on hirakhand express accident | Sakshi
Sakshi News home page

హీరాఖండ్‌ ఘటనపై ఎన్‌ఐఏ విచారణ

Published Mon, Jan 23 2017 2:18 PM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

NIA enquiry on hirakhand express accident

విజయనగరం: విజయనగరం జిల్లా కూనేరు స్టేషన్‌ వద్ద జరిగిన జగదల్‌ పూర్‌-భువనేశ్వర్‌ హీరాఖండ్‌ రైలు ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. ప్రమాదంపై అనుమానాలు తలెత్తడంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), ఏపీ సీఐడీ బృందాలు ఆ ప్రదేశాన్ని సోమవారం పరిశీలించాయి. కుట్ర జరిగి ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీఐడీ విభాగం కూడా సోమవారం సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించింది. ఈ బృందంలో అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు ద్వారకా తిరుమలరావు, ఐజీ అమిత్‌ గార్గ్‌ ఉన్నారు. ఈ ఘటనలో మావోయిస్టుల ప్రమేయం ఉండొచ్చనే అంశాన్ని అధికారులు కొట్టివేయలేకపోతున్నారు. కాగా, ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన ఓ బోగీ నుంచి మరో రెండు మృతదేహాలను సోమవారం వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 41కి పెరిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement