మా ఇంటి పక్కన గౌరి అనే మహిళ పురిటినొప్పులతో బాధపడుతుంటే నేను వెంటనే 108కి ఫోన్ చేశాను. వారు వివరాలు అన్ని అడిగి చివరికి సిబ్బంది లేదు రాలేమూ అని ఫోన్ కట్ చేశారు. ఆమెను షేర్ అటోలో తీసుకుని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించాను. మరో పది నిమిషాలు ఆలస్యం అయ్యి ఉంటే ఆమె ప్రాణానికి ప్రమాదం జరిగి ఉండేది. ఇలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. నేను ఇంటర్‌లో 978 మార్కులు సాధించాను. అయినా కానీ నాకు మెరిట్ స్కాలర్‌షిప్ ఇవ్వడం లేదు