టీడీపీ వైఫల్యాలను ప్రజలకు తెలపాలి | TDP Govt Is Failed Vizianagaram Peoples | Sakshi
Sakshi News home page

టీడీపీ వైఫల్యాలను ప్రజలకు తెలపాలి

Published Thu, Jun 14 2018 4:21 AM | Last Updated on Mon, Aug 20 2018 6:10 PM

విజయనగరం మున్సిపాలిటీ : గత నాలుగేళ్లలో అధికార టీడీపీ వైఫల్యాలను, ప్రజలకు చేసిన నయవంచనను ప్రజలకు వివరించాలని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం నాయకుడు ఈశ్వర్‌ కౌషిక్‌ అన్నారు. 38వ వార్డులో బుధవారం పార్టీ నాయకులు పిళ్లా వేణు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు వార్డుల్లో  కలియతిరుగుతూ నవరత్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. బూత్‌ కమిటీలను మరింత పటిష్టం చేయాలన్నారు.

అందరూ ఏకతాటిపై ఉండి విజయమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా  యువజన విభాగం అధ్యక్షుడు సంగంరెడ్డి బంగారునాయుడు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్య, తాడ్డి సురేష్, కరణం రమేష్, 38వ వార్డు పార్టీ నాయకులు పిళ్లా పాండు రంగారావు,  ఈళ్ల శివ, కాశి, అడారి చంటి, శివాజీ , రవి, నరేష్, గురునాథ్, గొల్లపూడి నాగేశ్వరరావు, పి వినోద్, శరత్, గణేష్, తిరు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement