ఏపీలో ఉపాధ్యాయులు ఆందోళన తీవ్రతరం చేశారు. ఉపాద్యాయులు అక్రమ బదీలు, ప్రభుత్వ పాఠశాలల మూసివేతలు ఆపాలని డిమాండ్ చేస్తూ టీచర్లు ఆందోళన చేస్తున్నారు. విజయనగరం కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.