సాక్షి, గజపతి నగరం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 286వ రోజు షెడ్యూల్ ఖరారైంది. జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. సోమవారం ఉదయం జననేత గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలంలోని నైట్క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.
అక్కడి నుంచి చౌదంతి వలస, బొబ్బిలి నియోజకవర్గంలోని పిండ్రంగి వలస, దొంకిన వలస, మీదుగా పెదపల్లి క్రాస్, లక్ష్మీపురం క్రాస్ వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment