తిరుపతిలో భారీ వర్షం
సాక్షి, చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట సభకు కొద్దిసేపు వర్షం ఆటంకంగా నిలిచింది. సోమవారం సాయంత్రం వాతావరణంలో అనూహ్య మార్పులు ఏర్పడి తిరుపతిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు చెల్లాచెదరు అయ్యాయి. అంతేకాకుండా భారీ గాలుల వీడయంతో వేదిక వద్ద రేకులు ఎగిరిపోయాయి. ఈ నేపథ్యంలో సీఎం సభ ఆలస్యంగా ప్రారంభం అయింది. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
కాగా ఇటీవలే ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం సందర్భంగా సీఎం చంద్రబాబు పర్యటన సమయంలోనూ భారీ వర్షం కురిసిన విషయం విదితమే. ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో కోదండరామయ్య కల్యాణోత్సవం సందర్భంగా వర్షం, ఈదురు గాలుల ధాటికి వేదిక కూలి, చెట్లు విరిగిపడి నలుగురు భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. 70 మంది గాయాల పాలయ్యారు. అధికారులు, పోలీసులు సైతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment