ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్‌సీ 43శాతం ఫిట్‌మెంట్ ప్రకటించి వదిలేసింది. అనుబంధ జీవో విడుదలలోనూ జాప్యం చేస్తోంది.
ఉద్యోగులకు ఊరడింపేనా?
Published Sat, Aug 13 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
అనంతపురం అర్బన్ : ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్‌సీ 43శాతం ఫిట్‌మెంట్ ప్రకటించి వదిలేసింది. అనుబంధ జీవో విడుదలలోనూ జాప్యం చేస్తోంది. పీఆర్‌సీ అరియర్స్ చెల్లింపుపై నిర్ణయం తీసుకోలేదు. రెండేళ్లుగా ఆ అరియర్స్, డీఏలు ఇచ్చే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. కనీసం ఆ ఊసే ఎత్తకపోవడంతో ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. జిల్లాలో 34,900 మంది ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ ఆరియర్స్ రూ.260 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. రెండేళ్లవుతున్నా ఆ ఊసే ఎత్తలేదు. పదో పీఆర్‌సీ కింద 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది. 2015 ఏప్రిల్ 1న పెరిగిన వేతనాలు అందుకుంటున్నారు. ప్రకటించిన ఫిట్‌మెంట్ మేరకు 2013 జూలై 1 నుంచి 2015 మార్చి 31 వరకు అరియర్స్ ఇవ్వాల్సి ఉంది. అయితే అరియర్స్‌ను 2013 జూలై 1 నుంచి 2014 జూన్ 1వ తేదీ వరకు నోషనల్ కింద పక్కన పెట్టింది. ఉద్యోగులు ఏడాది అరియర్స్ నష్టపోయారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకు అంటే తొమ్మిది నెలల అరియర్స్ అందాల్సి ఉంది. సగటున ఒక్కో ఉద్యోగికి పీఆర్‌సీ అరియర్స్ రూ.75 వేలు అనుకున్నా.. 34,900 మందికి రూ.260 కోట్లకు పైగానే చెల్లించాల్సి ఉంది.
ఎటూ తేల్చని డీఏ చెల్లింపు
ఉద్యోగులకు రెండు డీఏలు ప్రభుత్వం ప్రకటించింది గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పీఆర్‌సీ అరియర్స్. రెండు డీఏలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ జీవో విడుదల చేయకుండా ఉద్యోగులను అయోమయంలో పడేసింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పింఛనుదారులకూ సమస్యగానే మారింది. ఉద్యోగ విరమణ చేసినా అరియర్స్ అందుకోలేదు. వీరికి ఏవిధంగా అరియర్స్ చెల్లిస్తారనేది ప్రభుత్వం నుంచి స్పష్టత ఇవ్వలేదు.
Advertisement
Advertisement