న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం ఆలస్యం అయ్యే సూచనలు కనబడుతున్నాయి. వైరస్ వ్యాప్తి దృష్ట్యా సామూహిక వేడుకలపై నిషేధం ఉండటంతో ఈ కార్యక్రమాన్ని నెల లేదా రెండు నెలలు వాయిదా వేసే అవకాశముంది. భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతీ ఏడాది ఆగస్టు 29న జాతీ య క్రీడా అవార్డులను ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటివరకు అర్హుల జాబితా కూడా మంత్రిత్వ శాఖ సిద్ధం చేయలేదు. కనీసం సెలక్షన్ కమిటీని కూడా నియమించకపోవడం విశేషం. మరో వైపు హరియాణాకు చెందిన వుషూ ప్లేయర్ ‘శిక్షా’కు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 22 ఏళ్ల శిక్షా వ్యవసాయ కూలీగా మారడంతో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జాతీయ సంక్షేమ నిధి నుంచి ఆమెకు రూ. 5 లక్షలు మంజూరు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment