
క్యాథే పసిఫిక్ విమానానికి సాంకేతిక లోపం
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హాంకాంగ్ వెళ్లాల్సిన క్యాథే పసిఫిక్‌కు చెందిన విమానం ఆరు గంటలుగా నిలిచిపోయింది. సాంకేతిక ఇబ్బందుల కారణంగా నిలిపివేసినట్లు శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.