అక్టోబరులో హాలీవుడ్‌కు.. | Simbu to start shooting his English film from October | Sakshi

అక్టోబరులో హాలీవుడ్‌కు..

Sep 18 2017 4:30 AM | Updated on Sep 19 2017 4:41 PM

అక్టోబరులో హాలీవుడ్‌కు..

అక్టోబరులో హాలీవుడ్‌కు..

నటుడు శింబుది సపరేట్‌ భాణీ. సంచలనాలకు కేంద్ర బిందువుగా పేర్కొనే శింబు మరో రికార్డును సృష్టించడానికి రెడీ అవుతున్నారు.

తమిళసినిమా: నటుడు శింబుది సపరేట్‌ భాణీ. సంచలనాలకు కేంద్ర బిందువుగా పేర్కొనే శింబు మరో రికార్డును సృష్టించడానికి రెడీ అవుతున్నారు. అభిమానులు శింబుకు పోటీగా భావించే నటుడు ధనుష్‌ ఇప్పటికే హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా శింబు కూడా అదే మార్గంలో పయనించడానికి సిద్ధం అయ్యారు. వ్యత్యాసం ఏమిటంటే ధనుష్‌ హీరోగా హాలీవుడ్‌లో తెరంగేట్రం చేస్తుంటే, శింబు దర్శకుడిగా పరిచయం కానున్నారు. రెండు నెలల్లో తన చిత్రాన్ని విడుదల చేస్తానని శింబు ఆ మధ్య వెల్లడించారు. అందులో పాటలు ఉండవు, ఇంటర్వెల్‌ ఉండదు అని చెప్పారు గానీ అది హాలీవుడ్‌ చిత్రం అని తెలపకుండా సస్పెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేశారు.

ఆయన చెప్పినట్లుగా అయితే ఈ చిత్రం ఇప్పటికే సెట్‌పైకి వెళ్లాల్సింది. కొందరు ప్రముఖ సాంకేతిక వర్గం ఇతర చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల హాలీవుడ్‌ చిత్ర ప్రారంభం ఆలస్యం అయ్యిందని శింబు తాజాగా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి మాటలను అందిస్తున్న దర్శకుడు గౌతమ్‌మీనన్‌ తన ధ్రువనక్షత్రం చిత్ర షూటింగ్‌తోనూ, కెమెరామెన్‌ సంతోష్‌శివన్‌ స్పైడర్‌ చిత్రంతోనూ బిజీగా ఉండటం వల్ల తన హాలీవుడ్‌ చిత్రం సెట్‌పైకి వెళ్లడానికి కాస్త ఆలస్యం జరిగిందని చెప్పారు. ప్రస్తు తం వాళ్లు ఫ్రీ అవుతుండటంతో అక్టోబరులో హాలీవుడ్‌ చిత్రం ప్రారంభం కానుందని తెలిపారు. డిసెంబరు చివర్లోగా చిత్రాన్ని పూర్తి చేయనున్నామని చెప్పారు. ఈ చిత్రానికి ఆంటోనీ ఎడిటింగ్, యువన్‌ శంకర్‌రా జా నేపథ్యం సంగీతం అందించనున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement