హత్య ఘటనపై పోలీసుల దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదంటూ మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు.
పెబ్బేరు: హత్య ఘటనపై పోలీసుల దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదంటూ మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. వివరాలివీ...పెబ్బేరుకు చెందిన షకీల్ అనే వ్యక్తి పది రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదంటూ శనివారం ఉదయం 9.30 గంటల నుంచి స్థానిక ముస్లిం నాయకులు రాస్తారోకోకు దిగారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళన కారణంగా స్థానిక సుభాష్ సెంటర్‌లో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.