బెంగళూరు: టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా విమానంలో ఎదురైన చేదు అనుభవంపై ఓ ప్రయాణికుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకెప్పుడూ ఎయిర్‌ఇండియా విమానం ఎక్కబోనని, దానికంటే ఎడ్లబండి నయం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య కొండవార్ అనే ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగి ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారు.
బెంగళూరు నుంచి పుణెకు వెళ్లడానికి ఎయిర్‌ఇండియా విమానం ఎక్కినపుడు ఎదురైన సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ‘నాకు గొప్ప గుణపాఠం చెప్పినందుకు థ్యాంక్యూ. చివరకు ఎడ్లబండి అయినా ఎక్కుతాను కానీ ఇంకెప్పుడు మీ విమానంలో ప్రయాణించను. అవసరమైతే డబుల్ పే చేసి టైమ్‌కి వచ్చే విమానాల్లో వెళ్తాను.
Dear @AirIndiaX , Thank you for teaching me a very valuable lesson last night
Never and I mean it with all seriousness - I am never flying Air India Express or Air India in my life again - I will pay 100% extra cost if needed but will take other airlines that are on time (only…— Aditya Kondawar (@aditya_kondawar) June 25, 2024
జూన్ 24 రాత్రి 9.50 గంటలకు టేకాఫ్ కావాల్సిన విమానం అర్ధరాత్రి 12.20 గంటలు దాటిన తర్వాత బయల్దేరింది. ఎక్కిన తర్వాత విమానం మొత్తం ఒకటే వాసన. సీట్లు చాలా మురికిగా ఉన్నాయి. వాటి నిండా మరకలే. నాకు టాటా గ్రూప్‌పై అమితమైన గౌరవం ఉంది. అలాగే వారినుంచి ఎప్పుడూ నాణ్యమైన సేవలను ఆశిస్తాను.
కానీ నా అనుభవం మాత్రం భయంకరం’అని పోస్టులో తెలిపారు. ఈ పోస్టుపై ఎయిర్ ఇండియా స్పందించింది. ‘అసౌకర్యానికి చింతిస్తున్నాం. మా పరిధిలోలేని కారణాల వల్ల విమానం ఆలస్యమైందని దయచేసి గమనించండి. మీకు ఎదురైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం. ఎయిరిండియాలో ప్రయాణించొద్దనే నిర్ణయంపై పునరాలోచించండి’అని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment