Netizens Protest
-
‘‘ఎడ్ల బండైనా ఎక్కుతాను.. ఎయిర్ ఇండియా విమానం ఎక్కను’’
బెంగళూరు: టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా విమానంలో ఎదురైన చేదు అనుభవంపై ఓ ప్రయాణికుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకెప్పుడూ ఎయిర్ఇండియా విమానం ఎక్కబోనని, దానికంటే ఎడ్లబండి నయం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య కొండవార్ అనే ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగి ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టారు. బెంగళూరు నుంచి పుణెకు వెళ్లడానికి ఎయిర్ఇండియా విమానం ఎక్కినపుడు ఎదురైన సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ‘నాకు గొప్ప గుణపాఠం చెప్పినందుకు థ్యాంక్యూ. చివరకు ఎడ్లబండి అయినా ఎక్కుతాను కానీ ఇంకెప్పుడు మీ విమానంలో ప్రయాణించను. అవసరమైతే డబుల్ పే చేసి టైమ్‌కి వచ్చే విమానాల్లో వెళ్తాను. Dear @AirIndiaX , Thank you for teaching me a very valuable lesson last nightNever and I mean it with all seriousness - I am never flying Air India Express or Air India in my life again - I will pay 100% extra cost if needed but will take other airlines that are on time (only…— Aditya Kondawar (@aditya_kondawar) June 25, 2024 జూన్ 24 రాత్రి 9.50 గంటలకు టేకాఫ్ కావాల్సిన విమానం అర్ధరాత్రి 12.20 గంటలు దాటిన తర్వాత బయల్దేరింది. ఎక్కిన తర్వాత విమానం మొత్తం ఒకటే వాసన. సీట్లు చాలా మురికిగా ఉన్నాయి. వాటి నిండా మరకలే. నాకు టాటా గ్రూప్‌పై అమితమైన గౌరవం ఉంది. అలాగే వారినుంచి ఎప్పుడూ నాణ్యమైన సేవలను ఆశిస్తాను. కానీ నా అనుభవం మాత్రం భయంకరం’అని పోస్టులో తెలిపారు. ఈ పోస్టుపై ఎయిర్ ఇండియా స్పందించింది. ‘అసౌకర్యానికి చింతిస్తున్నాం. మా పరిధిలోలేని కారణాల వల్ల విమానం ఆలస్యమైందని దయచేసి గమనించండి. మీకు ఎదురైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం. ఎయిరిండియాలో ప్రయాణించొద్దనే నిర్ణయంపై పునరాలోచించండి’అని కోరింది. -
చైనా సంపన్నుడి సలహాపై నెటిజన్ల ఫైర్
బీజింగ్ : రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ వారానికి ఆరు రోజులు పనిచేయాలని ‘996’ ఫార్ములాను ప్రతిపాదించిన అలీబాబా వ్యవస్ధాపకుడు, చైనా సంపన్నుడు జాక్ మా తాజాగా మరో సలహాతో ముందుకొచ్చారు. వారానికి ఆరు రోజులు, ఆరుసార్లు శృంగారంలో పాల్గొనాలని ఉద్యోగులకు సూచించారు. అలీబాబా గ్రూప్ ఉద్యోగుల సామూహిక వివాహ వేడుక సందర్భంగా చైనాలోనే అత్యంత సంపన్నుడైన జాక్ మా ఈ ప్రతిపాదన చేసినట్టు డైలీ మెయిల్ వెల్లడించింది. పనిలో మనం ‘996’ను జీవితంలో ‘669’ను మనం ఫాలో కావాలని ఆయన చెప్పారు. కంపెనీ ప్రధాన కార్యాలయం హంగ్జూలో ఏటా మే 10న జరిగే సామూహిక వివాహాల సందర్భంగా 54 ఏళ్ల మా ఈ వ్యాఖ్యలు చేశారని డైలీ మెయిల్ పేర్కొంది. కాగా 996 పని ప్రతిపాదనను టెక్నాలజీ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, తాజాగా ఆయన ప్రతిపాదించిన 669ను కూడా నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఆఫీసులో 996 స్ఫూర్తితో పనిచేసిన తర్వాత ఇక ఇంట్లో 669 అమలు చేసేందుకు శక్తి ఎక్కడి నుంచి వస్తుందని పలువురు నెటిజన్లు నిట్టూర్చారు. కాగా ‘669’ కోట్‌ను వైబోలో అలీబాబా అధికారిక పేజ్‌లో పోస్ట్ చేశారు. -
దేశం విడిచి వెళ్లిపో : విరాట్ కోహ్లి
ఓ అభిమానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. నవంబర్ 5న పుట్టిన రోజు సందర్భంగా కోహ్లి తన పేరుతో ఉన్న యాప్‌ను ప్రారంభించాడు. ఈ యాప్‌లో ఓ క్రికెట్ ప్రేమికుడు భారత క్రికెటర్లపై కామెంట్లు చేశాడు. కాగా, అభిమాని వ్యాఖ్యలపై కోహ్లి ఇచ్చిన సమాధానం తీవ్ర దుమారం రేపింది. ‘కోహ్లి ఆటలో ప్రత్యేకత ఏం లేదు. ఇలాంటి ఇండియన్ క్రికెటర్ల కన్నా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రీడాకారుల ఆటతీరే నాకు ఎంతో ఇష్టం’ అని ‘కోహ్లి యాప్’లో సదరు అభిమాని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై చిర్రెత్తుకొచ్చిన విరాట్ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. (హ్యాపీ బర్త్‌డే రన్‌మెషీన్) ‘నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి. దేశం విడిచి వెళ్లిపో. ఈ దేశంలో ఉంటూ పరదేశాలపై ప్రేమ చాలానే ఉంది. నీవు నన్ను అభిమానించ మాత్రాన నాకేం కాదు.కానీ, నీకు ఈ దేశం సరైంది కాదు’ అని బదులిచ్చాడు. కాగా, కోహ్లి వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. విదేశాల్లో పెళ్లి చేసుకుని, విదేశీ వస్తువులను కొనుగోలు చేయండనే ప్రకటనల్లో పాల్గొంటూ.. దేశం గురించి మాట్లాడటం ఏంటని కోహ్లిపై విరుచుకుపడుతున్నారు. -
'అడ్డగోలుగా ఎస్ బీఐ చార్జీలు'
భారతీయ స్టేట్ బ్యాంకు ప్రవేశపెట్టిన చార్జీలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎస్ బీఐ చార్జీలు, సర్వీసు రుసుములు పునరుద్ధరించడం బ్యాకింగ్ చరిత్రలో బ్లాక్ డేగా వర్ణించారు. ప్రభుత్వ బ్యాంకు చర్యలు పేదలు, మధ్య తరగతి వారికి వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్పీజీ సిలెండర్ రూ. 86, ఏటీఎం లావాదేవిలపై రూ. 150, కనీస నిల్వ పెనాల్టీలతో సామాన్య జనంపై భారం మోపారని తెలిపారు. ఎస్ బీఐ అన్యాయంగా చార్జీలు పెంచిందని వాపోయారు. కనీస నిల్వను తప్పనిసరి చేసిన ఎస్ బీఐపై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బీఐ) ఎందుకు చర్యలు తీసుకోదని ప్రశ్నించారు. కొత్తగా ప్రవేశపెట్టిన రుసుములతో ఖాతాదారులకు ఎదురుదెబ్బ తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. 'మూడు సార్లు నగదు ఉపసంహరించుకుంటే ఎందుకు చార్జీలు వసూలు చేస్తారు? ఇందుకేనా ఖాతాలు తెరిచింద'ని మరొకరు ఆవేశంగా ప్రశ్నించారు. 'ముందుగా పౌరులందరినీ బ్యాకింగ్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు చార్జీలు మోత మోగించారు. ఆర్థిక సామ్రాజ్యవాదానికి స్వాగతం' అంటూ మరో నెటిజన్ మండిపడ్డారు. బ్యాంకుల్లో నగదు జమ చేసేలా ప్రజలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందని, ఇప్పుడు ప్రజల ధనంపై చార్జీలు, సర్వీసు రుసుములు విధించిందని మరొకరు పేర్కొన్నారు. ఎస్ బీఐ ప్రవేశపెట్టిన చార్జీలు అడ్డగోలుగా ఉన్నాయని, ఆలోచించేవారంతా దీనిపై పోరాటం చేయాలని మరొకరు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 6న నో ట్రాన్సక్షన్ డేగా పాటించి నిరసన తెలపాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఊపందుకుంది.