
ఓ అభిమానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. నవంబర్ 5న పుట్టిన రోజు సందర్భంగా కోహ్లి తన పేరుతో ఉన్న యాప్‌ను ప్రారంభించాడు. ఈ యాప్‌లో ఓ క్రికెట్ ప్రేమికుడు భారత క్రికెటర్లపై కామెంట్లు చేశాడు. కాగా, అభిమాని వ్యాఖ్యలపై కోహ్లి ఇచ్చిన సమాధానం తీవ్ర దుమారం రేపింది. ‘కోహ్లి ఆటలో ప్రత్యేకత ఏం లేదు. ఇలాంటి ఇండియన్ క్రికెటర్ల కన్నా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రీడాకారుల ఆటతీరే నాకు ఎంతో ఇష్టం’ అని ‘కోహ్లి యాప్’లో సదరు అభిమాని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై చిర్రెత్తుకొచ్చిన విరాట్ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. (హ్యాపీ బర్త్‌డే రన్‌మెషీన్)
‘నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి. దేశం విడిచి వెళ్లిపో. ఈ దేశంలో ఉంటూ పరదేశాలపై ప్రేమ చాలానే ఉంది. నీవు నన్ను అభిమానించ మాత్రాన నాకేం కాదు.కానీ, నీకు ఈ దేశం సరైంది కాదు’ అని బదులిచ్చాడు. కాగా, కోహ్లి వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. విదేశాల్లో పెళ్లి చేసుకుని, విదేశీ వస్తువులను కొనుగోలు చేయండనే ప్రకటనల్లో పాల్గొంటూ.. దేశం గురించి మాట్లాడటం ఏంటని కోహ్లిపై విరుచుకుపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment