'స్టార్ట్ అప్'ల ఆలస్యానికి నేనే కారణం: ప్రణబ్ | India Woke Up Late On Start-Ups, I Own Up For Delay: Pranab Mukherjee | Sakshi
Sakshi News home page

'స్టార్ట్ అప్'ల ఆలస్యానికి నేనే కారణం: ప్రణబ్

Published Sat, Jan 16 2016 10:35 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

'స్టార్ట్ అప్'ల ఆలస్యానికి నేనే కారణం: ప్రణబ్ - Sakshi

'స్టార్ట్ అప్'ల ఆలస్యానికి నేనే కారణం: ప్రణబ్

స్టార్ట్ అప్ ల విషయంలో దేశం ఆలస్యంగా మేల్కొందని, అందుకు కారణం కూడా తానేనని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన చెందారు.

న్యూఢిల్లీ: యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా స్టార్ట్ అప్ లను ప్రారంభించడంలో భారత్ వెనుకబడిపోయిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. స్టార్ట్ అప్ ల విషయంలో దేశం ఆలస్యంగా మేల్కొందని, అందుకు కారణం కూడా తానేనని ఆవేదన చెందారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'స్టార్ట్ అప్ ఇండియా' కార్యక్రమ ప్రారంభానికి కొద్ది గంటలముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

గ్రామీణ స్థాయిలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా చేపట్టనున్న స్టార్-అప్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సిలికాన్ వ్యాలీ సీఈవోలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న రాత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

'ప్రభుత్వం స్టార్ట్ అప్ లను బాగా ప్రోత్సహిస్తోందని మీలో చాలా మంది మాట్లాడారు. మీరన్నది సరైందే కానీ వాస్తవమేమిటంటే స్టార్ట్ అప్ ల విషయంలో ఇండియా ఇప్పుడే మేల్కొంది. జరిగిన ఆలస్యానికి భారీ మూల్యం కూడా చెల్లించుకుంటోంది. నిజానికి ఈ ప్రోత్సాహకాలు ఒక దశాబ్దం కిందటే ప్రవేశపెట్టిఉంటే గనుక పరిస్థితి మరోలా ఉండేది. ఆలస్యానికి ప్రధాన కారణం నేనేనని చెప్పక తప్పదు. ఆర్థిక మంత్రిగా(గతంలో) నూతన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంలో విఫలమయ్యా. అప్పట్లో నేను త్వరపడి ఉంటే బాగుండేది' అని ప్రణబ్ చెప్పుకొచ్చారు. స్టార్ట్ అప్ లను ప్రోత్సహించడంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ తీరును ఆయన ప్రశంసించారు.

కాగా శనివారం నాటి కార్యక్రమంలో స్టార్ట్-అప్ ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా స్టార్ట్-అప్‌లో ప్రారంభించిన యువ సీఈవోలు హాజరుకానున్నారు. స్టార్ట్-అప్ వర్చువల్ ఎగ్జిబిషన్‌ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. బ్యాంక్ రుణాలతో పాటు ఇతర ప్రోత్సహాకాలను యువ పారిశ్రామికవేత్తలకు కల్పించే లక్ష్యంగా స్టార్ట్-అప్ ఉద్యమం సాగనుంది. ఈ రోజు జరిగే కార్యక్రమంలో కీలక మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన కార్యదర్శులతో యువ పారిశ్రామికవేత్తలు ముఖాముఖీ చర్చలు జరిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement