న్యూఢిల్లీ: వృద్ధులు (60 ఏళ్లు దాటిన వారు) హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో కొంత సమయం తీసుకుంటున్నారు. 60 ఏళ్లలోపు వారితో పోలిస్తే వారం ఆలస్యంగా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్టు ‘సెక్యూర్ నౌ’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తెలిసింది. ఆస్పత్రిలో చేరినా కానీ, తమ చికిత్స గురించి బీమా సంస్థకు సమాచారం ఇచ్చే విషయంలో వారు జాప్యం చేస్తున్నారు. నగదు రహిత చికిత్సను వృద్ధులు ఎంపిక చేసుకోపోతే, వారు క్లెయిమ్‌లను కచ్చితత్వంతో దాఖలు చేసేందుకు ఆస్పత్రులు, బీమా సంస్థలు, మధ్యవర్తులు సాయం అందించాలని మెహతా సూచించారు.
60 ఏళ్లలోపు వారికి క్లెయిమ్ పరిష్కారం అయ్యేందుకు 23 రోజుల సయం పడుతోంది. అదే సీనియర్ సిటిజన్‌లు అయితే 28 రోజుల సమయం తీసుకుంటోంది. ఇతరులతో పోలిస్తే వృద్ధులు ఎక్కువ ప్రీమియం చెల్లిస్తారన్న విషయాన్ని మెహతా గుర్తు చేశారు. 30 ఏళ్ల వ్యక్తికి ప్రీమియం రూ.10,365గా ఉంటే, 45 ఏళ్లకు ఇది రూ.15,239, 60 ఏళ్లకు రూ.31,905 అవుతున్నట్టు చెప్పారు. ఇక 75 ఏళ్ల వయసులో వీరు రూ.66,368 చెల్లించాల్సి వస్తుందన్నారు. డయేరియా, కేన్సర్, ప్రొస్టేట్ పెరుగుదల సమస్య, కరోనరీ గుండె జబ్బులకు క్లెయిమ్ నిష్పత్తి (వృద్ధులకు) తక్కువగా ఉంటున్నట్టు ఈ సర్వే గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment