
ఉత్తమ విలన్ ఆగిపోయింది
చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ అభిమానులకు ఇది నిరాశే. ప్రారంభం నుంచి చిక్కులు ఎదుర్కొంటున్న ఆయన నటించిన 'ఉత్తమ విలన్' చిత్రం తాజాగా చిత్ర నిర్మాతల వల్లే మరో సమస్యలో పడింది. శుక్రవారం విడుదల కావాల్సిన ఆ చిత్రం ఆగిపోయింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదల కాకుండా నిలిచిపోయింది.
చిత్ర నిర్మాతలకు ఫైనాన్షియర్లకు మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలు నెలకొని చిత్ర శుక్రవారం ఉదయం వేయాల్సిన మొదటి ఆటలు నిలిపివేశారు. మరో కొన్ని గంటల్లో వారి సమస్య చర్చల ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం ఉందని, శుక్రవారం తర్వాత సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్లలో ఒకరు చెప్పారు. మరొకరు మాత్రం మ్యాట్నీకిగాని, ఫస్ట్ షోకుగానీ విడుదల చేస్తారని అన్నారు. రమేశ్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎనిమిదో శతాబ్దానికి చెందిన వ్యక్తిగా.. మోడరన్ సూపర్ స్టార్గా కమల్ ఈ చిత్రంలో నటించారు.