
న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలోని మూడు రన్‌వేలలో ఒకదాన్ని మూసివేయడంతో ప్రయాణికులపై అదనపు భారం పడింది. దీనికి తోడు వారాంతంలో డిమాండ్ పెరగడంతో ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు టికెట్ల ధరలు గరిష్టంగా 86 శాతం పెరిగాయి. ఒక రన్‌వేను మరమ్మతుల నిమిత్తం 13 రోజుల పాటు మూసివేశారు. దీని వల్ల విమానాల రాకపోకలు 50 వరకు తగ్గనున్నాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లే విమానాల చార్జీలు దాదాపు 57 శాతం పెరిగాయి.