రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గార్‌పల్లి గ్రామంలో జరుగుతున్న మిషన్ భగీరథ పథకం పనుల్లో అపశృతి చోటుచేసుకుంది.
కీసర (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా కీసర మండలం యాద్గార్‌పల్లి గ్రామంలో జరుగుతున్న మిషన్ భగీరథ పథకం పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. శనివారం జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతిచెందాడు. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన కొండలు(38) యాద్గార్‌పల్లి సమీపంలో కీసర వరకు కొనసాగుతున్న మిషన్ భగీరథ పథకం పనుల్లో పాల్గొంటున్నాడు.
శనివారం ఉదయం రోడ్డుపక్కన గుంతల్లో క్రేన్‌తో పైపులను దించుతున్నారు. కొండలు క్రేన్ డ్రైవర్‌కు సాయంగా ఉంటూ పైప్‌లను దించేందుకు సైడ్ చూపించసాగాడు. ఈ క్రమంలో కొండలును గమనించకుండా క్రేన్ డ్రైవర్ క్రేన్‌ను ముందుకు నడిపాడు. దీంతో క్రేన్ బలంగా తగిలి కొండలు అక్కడికక్కడే మృతి చెందాడు. కొండలుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.