సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని రత్నగిరిలో చేపల వేటకు వెళ్లిన జాలరిని అదృష్టం వరించింది. జాలరి వలకు ఏకంగా 2400 కిలోల బరువు కలిగిన నాలుగు చేపలు చిక్కాయి. చేపలను బయటికి లాగేందుకు క్రేన్‌ను తెప్పించారంటే వాటి బరువు ఏపాటిదో తెలుస్తోంది. సాధారణంగా ఇక్కడి జలాల్లో లభ్యమయ్యే వాఘిల్ చేప బరువు 50 నుంచి 60 కిలోల మధ్య ఉంటుండగా, తాజాగా వలకు చిక్కిన చేప ఒక్కోటి 500 కిలోల బరువుంది.
ఈ వార్త స్ధానికుల ద్వారా వ్యాపించడంతో సమీప ప్రాంతాల నుంచి భారీ చేపలను చూసేందుకు జనం పెద్దసంఖ్యలో గుమికూడారు. ఒక్కో చేప ఖరీదు రూ 15,000 నుంచి రూ 20,000 వరకూ ఉంటుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment