నిమజ్జన ఖర్చు ఘనంగానే ఉంది.. | GHMC Expense on Ganesh Nimajjanam | Sakshi
Sakshi News home page

జై ఘననాథ

Published Fri, Sep 6 2019 10:01 AM | Last Updated on Tue, Sep 10 2019 11:58 AM

GHMC Expense on Ganesh Nimajjanam - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గణనాథుడి నిమజ్జన ఖర్చు ఘనంగానే ఉంది. క్రేన్ల అద్దె, కార్మికుల వేతనాలు తదితరాల కోసం జీహెచ్‌ఎంసీ రూ.కోట్లలోనే ఖర్చు చేస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం నగరంలోని 32 చెరువుల్లో నిమజ్జనాలు చేస్తుండగా... ఇక చిన్నాచితకా కొలనులకు లెక్కే లేదు. హుస్సేన్‌సాగర్‌ సహా జోన్ల పరిధిలోని 32 చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన క్రేన్లను జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగం సమకూరుస్తోంది. బుధవారం నుంచి ప్రారంభమైన నిమజ్జనాలు ఈ నెల 15 వరకు కొనసాగుతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా చెరువుల్లో నిమజ్జనమయ్యే విగ్రహాల సంఖ్యకు అనుగుణంగా క్రేన్లు, సిబ్బందిని వినియోగిస్తున్నారు. నిమజ్జనం జరిగే గంటలను పరిగణనలోకి తీసుకొని అవసరమయ్యే కార్మికులను బ్యాచ్‌ల వారీగా వినియోగించనున్నట్లు... వేతనాలనూ గంటల వారీగా చెల్లించనున్నట్లు ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కాంపాటి ‘సాక్షి’కి తెలిపారు. క్రేన్ల దగ్గర అవసరాన్ని బట్టి నలుగురు, ఎనిమిది మంది, 12 మంది కార్మికులతో కూడిన బ్యాచ్‌లను ఏర్పాటు చేశారు. ప్రాథమిక అంచనా మేరకు క్రేన్ల  అద్దె, సిబ్బంది వేతనాలకు దాదాపు రూ.8.24 కోట్లు ఖర్చు కానుండగా... ఆయా ప్రాంతాల్లోని నిమజ్జనాల పరిస్థితులు, పోలీసుల నుంచి అందుతున్న సమాచారం తదితర పరిగణనలోకి తీసుకుంటే వ్యయం రూ.9 కోట్లకు చేరే అవకాశముందని పేర్కొన్నారు. 

కార్మికులు ఇలా...  
8 మంది బ్యాచ్‌లు – 1,300 (10,400 మంది కార్మికులు)
12 మంది బ్యాచ్‌లు – 164 (1,968 మంది కార్మికులు)
నలుగురు ఉండే బ్యాచ్‌లు – 776 (3,104 మంది కార్మికులు)
మొత్తం బ్యాచ్‌లు – 2,240, మొత్తం కార్మికులు – 15,472

ఖర్చు ఇలా...   క్రేన్ల అద్దె  
15 టన్నుల క్రేన్లకు గంటకు రూ.5,241 చొప్పున మొత్తం రూ.3,04,39,728.  
30–70 టన్నుల క్రేన్లకు గంటకు రూ.6,825 చొప్పున మొత్తం రూ.2,03,11,200.
మొబైల్‌ క్రేన్లకు గంటకు రూ.5,241 చొప్పున మొత్తం రూ.2,44,02,096.  

కార్మికుల వేతనాలు   
8 మంది బ్యాచ్‌కు రూ.3,794 చొప్పున రూ.49,32,200
12 మంది బ్యాచ్‌కు రూ.5,664.50 చొప్పున రూ.9,28,978
నలుగురి బ్యాచ్‌కు రూ.1,897 చొప్పున రూ.14,72,072
 మొత్తం ఖర్చు రూ.8,24,86,274

ఏ క్రేన్లు ఎన్ని?  
15 టన్నుల క్రేన్లు – 52   
30–70 టన్నుల క్రేన్లు – 41
మొబైల్‌ క్రేన్లు – 164   
మొత్తం క్రేన్లు – 257
మొత్తం పని గంటలు – 13,440

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement