
వాషింగ్టన్ : భూమికి 500 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ నక్షత్రాన్ని హబుల్ టెలిస్కోప్ గుర్తించింది. ఈ నక్షత్రానికి ఇకారస్ అని నామకరణం చేశారు. ఈ బ్లూస్టార్ కిరణాలు భూమిని చేరడానికి 900 కోట్ల సంవత్సరాలు పడుతుందంటే అది ఎంత దూరంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోని ఏ టెలిస్కోప్‌తోనూ ఇంత దూరంలో ఉన్న నక్షత్రాలను చూడటం సాధ్యం కాదు. అయితే గ్రావిటేషనల్ లెన్సింగ్ టెక్నిక్ ఉపయోగించి ఇంత దూరంలో ఉన్న నక్షత్రాన్ని గుర్తించిన ఆస్ట్రోనామర్స్ కొత్త రికార్డును సృష్టించారు.
ఇంత పెద్ద, ఒంటరి నక్షత్రాన్ని చూడటం ఇదే తొలిసారి అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ పాట్రిక్ కెల్లీ చెప్పారు. అక్కడ మనం సాధారణంగా ఒంటరి గెలాక్సీలను చూడొచ్చు. కానీ ఈ నక్షత్రం మాత్రం మనం అధ్యయనం చేయగల ఒంటరి నక్షత్రం కంటే వంద రెట్ల దూరంలో ఉంది అని కెల్లీ తెలిపారు. గ్రావిటేషనల్ లెన్స్‌తోపాటు హబుల్ టెలిస్కోప్‌కు ఉన్న అత్యంత శక్తిమంతమైన రెజల్యూషన్ సాయంతో ఆస్ట్రోనాట్స్ ఇకారస్‌ను అధ్యయనం చేయగలరు.
Comments
Please login to add a commentAdd a comment