ఆ అమ్మాయిది మూలా నక్షత్రమా?! | Astrology information | Sakshi
Sakshi News home page

ఆ అమ్మాయిది మూలా నక్షత్రమా?!

Jul 29 2017 11:59 PM | Updated on Sep 5 2017 5:10 PM

ఆ అమ్మాయిది మూలా నక్షత్రమా?!

ఆ అమ్మాయిది మూలా నక్షత్రమా?!

వివాహ పొంతనలకు జాతకం తీసుకోగానే ‘‘అమ్మో అమ్మాయిది అశ్లేష నక్షత్రం అట అత్తగారికి గండం మాకు ఆ సంబంధం వద్దనీ,

వివాహ పొంతనలకు జాతకం తీసుకోగానే ‘‘అమ్మో అమ్మాయిది అశ్లేష నక్షత్రం అట అత్తగారికి గండం మాకు ఆ సంబంధం వద్దనీ, మూల నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే మామగారు చని పోతారని, జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన కన్యను తెచ్చుకుంటే కోడలి బావగారు  చనిపోతారని, విశాఖ నక్షత్రంలో పుట్టిన  అమ్మాయి అయితే ఆఖరి మరిది చనిపోతాడని, మఖ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని తెచ్చుకుంటే ఇంట్లో ఎవరైనా పోవచ్చని... ఇలా చాలా మూఢ నమ్మకాలు పాతుకు పోయి ఉన్నాయి. ఈ నక్షత్రాలలో పుట్టినవారు పెళ్లికి పనికిరారా? వారిని చేసుకోకూడదా?  అంటే శాస్త్రం ఇలాంటి మాటలు ఎప్పుడూ చెప్పదు!

నక్షత్రాల వల్ల జరిగితే మంచి జరుగుతుంది గాని చెడు జరగదు. నక్షత్రాలపై మీకు ఏదైనా సంశయం ఉంటే అది వివాహం చేసుకున్న భార్యాభర్తలకే వర్తిస్తుంది కాని, తల్లితండ్రులకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు వర్తించదు. కాబట్టి జాతకంలో అన్నిటికీ పొంతన కుదిరితే నక్షత్రం పేరు మీద అనవసరంగా భయానికి లోనై విద్య, వినయం, వివేకం, గుణం, సాంప్రదాయం, సంస్కారం, రూపం గల వధువులను విసర్జించవద్దు.  ఏమాత్రం సంకోచం లేకుండా మీరు ఆ కన్యను కోడలిగా తెచ్చుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement