ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ జిలా సిరిసిల్ల పట్టణంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మండలంలోని గోపాలపల్లికి చెందిన సందిరి శంకర్(53), తార(50) సిరిసిల్లలోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా వివాహాలు పూర్తయ్యాయి. శంకర్, తార ఇద్దరే అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, శంకర్‌కు అనారోగ్యంతో వారు మనస్తాపం చెందారు. బుధవారం తెల్లవారుజామున వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తార మృతి చెందగా, తీవ్ర కాలిన గాయాలతో శంకర్ పరిస్థితి విషమంగా ఉంది. అతడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.