NASA Shares Photo Of Herbig Haro object In Space - Sakshi
Sakshi News home page

ఖగోళం ఖాతాలో మరో అద్భుతం.. చుక్కల దృశ్యాల్ని చూసి తీరాల్సిందే

Published Tue, Sep 7 2021 1:03 PM | Last Updated on Tue, Sep 7 2021 5:58 PM

Nasa Shares Photo Of Herbig Haro object In Space - Sakshi

అద్భుతాల నిలయం ఖగోళం. అనాది కాలం నుంచి ఖగోళ విషయాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నా ఇప్పటికీ మనకు తెలిసింది చాలా చాలా తక్కువ. అందుకే అంతుచిక్కని విషయాలను ఖగోళ రహస్యంగా పేర్కొంటారు. పాలపుంతలు, కృష్ణబిలాలు, నక్షత్రాలు , గ్రహాలు, ఉపగ్రహాలు, అస్టరాయిడ్స్‌ వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు అమెరిక స్పేస్‌ ఏజెన్సీ నాసా ఎప్పటి నుంచో ప్రయోగాలు, పరిశోధనలు చేస్తూనే ఉంది. ఇటీవల నవజాత నక్షత్రానికి సంబంధించి కొన్ని అద్భుతమైన దృశ్యాలను నాసా విడుదల చేసింది. హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ సాయంతో నాసా ఈ చిత్రాలను తీసింది.

హెర్బిగ్‌ హెరో ఆబ్జెక్ట్‌
ఖగోళంలో కొత్తగా ఆవిష్కృతమైన నక్షత్రం నుంచి నిరంతరం వాయువులు నిరంతరం బయటకు ఎగజిమ్ముతుంటాయి. ఇవి వందల కిలోమీటర్ల దూరం వరకు ఖగోళంలో ప్రయాణిస్తాయి. ఆ సమయంలో అవి తమలోని ఎలక్ట్రాన్లను కోల్పోతుంటాయి. ఈ ప్రయాణ సమయంలో ఏదైనా గాలి మేఘాలు ఎదురైనప్పుడు వాటిని చీల్చుకుంటూ ముందుకు వెళ్తాయి. ఈ క్రమంలో ఖగోళంలో అద్భతమైన దృశ్యాలు వెలువడుతాయి. సింపుల్‌గా దీన్నే హెర్బిగ్‌ హెరో ఆబ్జెక్ట్‌ అంటారు. 

చదవండి : ఆకాశంలో ఒక్కసారిగా పేలిపో​యిన రాకెట్‌....!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement