NASA - Space Contest
-
సునీత రాక ఫిబ్రవరిలోనే!
కేప్‌కనావెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి రావడానికి బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్యూల్ సురక్షితం కాదని నాసా తేల్చిచెప్పింది. వారిని అందులో వెనక్కు తీసుకురావడం అత్యంత ప్రమాదకరమని శనివారం పేర్కొంది. ఆ రిస్క్ తీసుకోరాదని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్ మస్‌్కకు చెందిన స్పేస్ ఎక్స్ షటిల్ డ్రాగన్ క్యాప్సూల్‌లో వారిని తీసుకురావాలని నిర్ణయించింది.పలు వైఫల్యాల తర్వాత బోయింగ్ స్టార్‌లైనర్ గత జూన్‌లో సునీత, విల్మోర్లను అంతరిక్ష కేంద్రానికి చేర్చడం తెలిసిందే. థ్రస్టర్లు మొరాయించడం, హీలియం లీకేజీ తదితర సమస్యల నడుమ అతికష్టమ్మీద∙స్టార్‌లైనర్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. వారం కోసమని వెళ్లిన సునీత, విల్మోర్ అక్కడే చిక్కుకుపోయారు. ఫిబ్రవరిలో తిరుగు ప్రమాణమంటే ఎనిమిది నెలలకు పైగా ఐఎస్ఎస్లోనే గడపనున్నారు. స్టార్‌లైనర్‌కు మరమ్మతులు చేయడానికి బోయింగ్ ఇంజనీర్లతో కలిసి నాసా తీవ్రంగా శ్రమించింది. మూడునెలల ప్రయత్నాల అనంతరం.. మానవసహిత తిరుగు ప్రమాణానికి స్టార్‌లైనర్ సురక్షితం కాదని తేల్చేసింది. అది ఒకటి, రెండు వారాల్లో ఐఎస్ఎస్ నుంచి విడివడి ఆటోపైలెట్ మోడ్‌లో ఖాళీగా భూమికి తిరిగి రానుంది. తమ విమానాల భద్రతపై ఇప్పటికే ఇబ్బందులను ఎదుర్కొంటున్న బోయింగ్‌కు స్టార్‌లైనర్ వైఫల్యం గట్టి ఎదురుదెబ్బే.స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలోనే ఉంది. మార్చి నుంచి ఐఎస్ఎస్లో ఉన్న నలుగురు వ్యోమగాములను తీసుకుని సెపె్టంబరు నెలాఖరులో భూమికి తిరిగివస్తుంది. అత్యవసరమైతే తప్ప అందులో మరో ఇద్దరిని ఇరికించడం సురక్షితం కాదని నాసా తెలిపింది. రష్యాకు చెందిన సోయుజ్ క్యాప్సూల్ కూడా ఐఎస్ఎస్లోనే ఉన్నా అందులోనూ ముగ్గురికే చోటుంది. ఏడాదిగా ఐఎస్ఎస్లో ఉన్న ఇద్దరు రష్యా వ్యోమగాములు అందులో తిరిగొస్తారు. డ్రాగన్ సెపె్టంబరులో ఇద్దరు వ్యోమగాములతో ఐఎస్ఎఐస్కు వెళ్తుంది. తిరుగు ప్రమాణంలో సునీత, విల్మోర్లను కూడా తీసుకొస్తుంది. -
అదృష్టం అతిధిలా వచ్చి, స్పేస్‌లో ఎగిరేందుకు ఆఫర్ ఇచ్చి..!
అదృష్టం అతిధిలా వచ్చి, స్పేస్‌లో ఎగిరేందుకు ఆఫర్ ఇవ్వడం అంటే ఇదేనేమో. ఆంటిగ్వా - బార్బుడా దేశానికి చెందిన తల్లికూతుళ్లు ఫ్రీగా స్పేస్ ట్రావెల్ చేసేందుకు టికెట్లను సొంతం చేసుకున్నారు. త్వరలో వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ టూర్‌ను ప్రారంభించనుంది. ఈ టూర్లో పాల్గొనేందుకు ఆంటిగ్వా - బార్బుడాకి చెందిన 44 ఏళ్ల కైషా షాహాఫ్, బ్రిటన్‌లో నివసిస్తున్న ఆమె కూతురు 17 ఏళ్ల సైన్స్ విద్యార్థితో కలిసి ఉచితంగా నింగిలోకి ఎగరనున్నారు. This is the moment we told Keisha Schahaff she’s won @virgingalactic’s @omaze competition and she’s going to space… Her reaction brought tears to my eyes! https://t.co/F6iBgXC5P0 @spacehumanity pic.twitter.com/G9VXuMAhTi — Richard Branson (@richardbranson) November 24, 2021 ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం వర్జిన్ గెలాక్టిక్ - స్వీప్స్ టేక్ తో కలిసి ఫండ్ రైజింగ్ 'ఓమెజ్'లో 1.7మిలియన్ డాలర్లు ఫండ్ రైజ్ చేసింది. 8 వారాల పాటు నిర్వహించిన ఈ ఫండ్ రైజింగ్ కోసం వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ ప్రత్యేకంగా లాటరీ పద్దతిని ఏర్పాటు చేశారు. మినిమం 10డాలర్లతో టోకన్తో ఫండ్ రైజ్ చేయొచ్చు. ఇలా ఈ ఫండ్ రైజింగ్ లో వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, ముఖ్యంగా అంతరిక్షంలోకి వెళ్లాలనుకునేవారికి, లేదంటే నాసాలో పనిచేయాలనుకునే వారికి క్యాష్ రూపంలో కాకుండా బహుమతి రూపంలో అందిస్తున్నట్లు రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ ప్రకటించారు. ఈ ప్రకటనతో 165,000 మంది ఫండ్ రైజింగ్‌లో పాల్గొన్నారు. 8 వారాల పాటు నిర్విరామంగా జరిగిన అనంతరం ఇందులో విన్నర్స్‌ను రిచర్డ్స్ బ్రాన్స్‌న్ ప్రకటించారు. అంతేకాదు గెలిచిన వారికి స్వయంగా ఇంటికి వెళ్లి బహుమతులందిస్తున్నారు. అలా స్పేస్‌లోకి వెళ్లే అవకాశాన్ని దక్కించుకున్న కైషా షాహాఫ్ ఇంటికి వెళ్లి రిచర్డ్స్ బ్రాన్స్‌న్ ఆశ్చర్యపరిచారు. దీంతో గెలుపుపై కైషా షాహాఫ్ సంతోషం వ్యక్తం చేశారు. కూతురుతో కలిసి స్పేస్‌లోకి వెళ్లే కోరిక నెరవేరుతుందని అన్నారు. చదవండి: అడిడాస్ సంచలన నిర్ణయం..! ఫేస్‌బుక్‌కు పెద్ద దెబ్బే..! -
నక్షత్రం పుట్టిందోచ్.. ఫోటోలు రిలీజ్ చేసిన నాసా
అద్భుతాల నిలయం ఖగోళం. అనాది కాలం నుంచి ఖగోళ విషయాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నా ఇప్పటికీ మనకు తెలిసింది చాలా చాలా తక్కువ. అందుకే అంతుచిక్కని విషయాలను ఖగోళ రహస్యంగా పేర్కొంటారు. పాలపుంతలు, కృష్ణబిలాలు, నక్షత్రాలు , గ్రహాలు, ఉపగ్రహాలు, అస్టరాయిడ్స్ వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు అమెరిక స్పేస్ ఏజెన్సీ నాసా ఎప్పటి నుంచో ప్రయోగాలు, పరిశోధనలు చేస్తూనే ఉంది. ఇటీవల నవజాత నక్షత్రానికి సంబంధించి కొన్ని అద్భుతమైన దృశ్యాలను నాసా విడుదల చేసింది. హబుల్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో నాసా ఈ చిత్రాలను తీసింది. హెర్బిగ్ హెరో ఆబ్జెక్ట్ ఖగోళంలో కొత్తగా ఆవిష్కృతమైన నక్షత్రం నుంచి నిరంతరం వాయువులు నిరంతరం బయటకు ఎగజిమ్ముతుంటాయి. ఇవి వందల కిలోమీటర్ల దూరం వరకు ఖగోళంలో ప్రయాణిస్తాయి. ఆ సమయంలో అవి తమలోని ఎలక్ట్రాన్లను కోల్పోతుంటాయి. ఈ ప్రయాణ సమయంలో ఏదైనా గాలి మేఘాలు ఎదురైనప్పుడు వాటిని చీల్చుకుంటూ ముందుకు వెళ్తాయి. ఈ క్రమంలో ఖగోళంలో అద్భతమైన దృశ్యాలు వెలువడుతాయి. సింపుల్‌గా దీన్నే హెర్బిగ్ హెరో ఆబ్జెక్ట్ అంటారు. These stars may be young but they're mighty. 💪 This @NASAHubble image features a relatively rare celestial phenomenon, occuring when newly formed stars expel very narrow jets of rapidly moving ionized gas: https://t.co/eMNA1A5wHc pic.twitter.com/VL2Nky3A36 — NASA (@NASA) September 5, 2021 చదవండి : ఆకాశంలో ఒక్కసారిగా పేలిపోయిన రాకెట్....! -
నాసా-స్పేస్ కాంటెస్ట్‌లో ప్రపంచ నం.1గా శ్రీచైతన్య
హైదరాబాద్: అమెరికా, నాసా (నేషనల్ స్పేస్ సొసైటీ)లు సంయుక్తంగా చేపట్టిన ప్రపంచ స్థాయి నాసా-స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ చరిత్రలో ఒకే సంవత్సరంలో అత్యధిక ప్రాజెక్టుల(13) విజేతగా శ్రీచైతన్య రికార్డు సృష్టించినట్టు శ్రీచైతన్య స్కూల్ డెరైక్టర్లు సీమ, సుష్మలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొదటి స్థానంలో-2, రెండో స్థానంలో-5, మూడో స్థానంలో-3, ఇతర స్థానాల్లో-3 ప్రాజెక్టులు తమ విద్యార్థులు కైవసం చేసుకున్నట్టు తెలిపారు. అదేవిధంగా ప్రపంచంలో ఒకే విద్యాసంస్థ నుంచి అత్యధికంగా ఎంపికైన విద్యార్థుల సంఖ్య(55)లో గానీ, అత్యధిక విన్నింగ్ ప్రాజెక్టుల(13-62 శాతం) సంఖ్యలో గానీ తమ సంస్థ నంబర్-1గా నిలిచిందన్నారు.