అదృష్టం అతిధిలా వచ్చి, స్పేస్‌లో ఎగిరేందుకు ఆఫర్ ఇవ్వడం అంటే ఇదేనేమో. ఆంటిగ్వా - బార్బుడా దేశానికి చెందిన తల్లికూతుళ్లు ఫ్రీగా స్పేస్ ట్రావెల్ చేసేందుకు టికెట్లను సొంతం చేసుకున్నారు. త్వరలో వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ టూర్‌ను ప్రారంభించనుంది. ఈ టూర్‌లో పాల్గొనేందుకు ఆంటిగ్వా - బార్బుడాకి చెందిన 44 ఏళ్ల కైషా షాహాఫ్, బ్రిటన్‌లో నివసిస్తున్న ఆమె కూతురు 17 ఏళ్ల సైన్స్ విద్యార్థితో కలిసి ఉచితంగా నింగిలోకి ఎగరనున్నారు.
This is the moment we told Keisha Schahaff she’s won @virgingalactic’s @omaze competition and she’s going to space… Her reaction brought tears to my eyes! https://t.co/F6iBgXC5P0 @spacehumanity pic.twitter.com/G9VXuMAhTi
— Richard Branson (@richardbranson) November 24, 2021
ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం
వర్జిన్ గెలాక్టిక్ - స్వీప్స్ టేక్ తో కలిసి ఫండ్ రైజింగ్ 'ఓమెజ్'లో 1.7మిలియన్ డాలర్లు ఫండ్ రైజ్ చేసింది. 8 వారాల పాటు నిర్వహించిన ఈ ఫండ్ రైజింగ్ కోసం వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ ప్రత్యేకంగా లాటరీ పద్దతిని ఏర్పాటు చేశారు. మినిమం 10డాలర్లతో టోకన్‌తో ఫండ్ రైజ్ చేయొచ్చు. ఇలా ఈ ఫండ్ రైజింగ్ లో వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, ముఖ్యంగా అంతరిక్షంలోకి వెళ్లాలనుకునేవారికి, లేదంటే నాసాలో పనిచేయాలనుకునే వారికి క్యాష్ రూపంలో కాకుండా బహుమతి రూపంలో అందిస్తున్నట్లు రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ ప్రకటించారు.
ఈ ప్రకటనతో 165,000 మంది ఫండ్ రైజింగ్‌లో పాల్గొన్నారు. 8 వారాల పాటు నిర్విరామంగా జరిగిన అనంతరం ఇందులో విన్నర్స్‌ను రిచర్డ్స్ బ్రాన్స్‌న్ ప్రకటించారు. అంతేకాదు గెలిచిన వారికి స్వయంగా ఇంటికి వెళ్లి బహుమతులందిస్తున్నారు. అలా స్పేస్‌లోకి వెళ్లే అవకాశాన్ని దక్కించుకున్న కైషా షాహాఫ్ ఇంటికి వెళ్లి రిచర్డ్స్ బ్రాన్స్‌న్ ఆశ్చర్యపరిచారు. దీంతో గెలుపుపై కైషా షాహాఫ్ సంతోషం వ్యక్తం చేశారు. కూతురుతో కలిసి స్పేస్‌లోకి వెళ్లే కోరిక నెరవేరుతుందని అన్నారు.
చదవండి: అడిడాస్ సంచలన నిర్ణయం..! ఫేస్‌బుక్‌కు పెద్ద దెబ్బే..!
Comments
Please login to add a commentAdd a comment