నా నిశ్చితార్థానికి నన్నూ పిలవండి! | Taapsee trashes rumors about her engagement | Sakshi
Sakshi News home page

నా నిశ్చితార్థానికి నన్నూ పిలవండి!

Published Fri, Jul 27 2018 1:34 AM | Last Updated on Fri, Jul 27 2018 1:34 AM

Taapsee trashes rumors about her engagement - Sakshi

తాప్సీ

దాదాపు అరడజను సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు కథానాయిక తాప్సీ. ప్రమోషన్లు, షూటింగ్‌లు, లొకేషన్‌ షిఫ్టింగ్‌లు అంటూ ఆమె డైరీ ఫుల్‌గా ఉంది. కానీ ఇంతలో ఆమె పెళ్లికి కూడా డేట్స్‌ ఇచ్చారనీ, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మాథ్యూస్‌ బోయితో ఏడడుగులు వేయనున్నారని ఓ వెబ్‌సైట్‌లో వార్త షికారు చేస్తోంది. అంతేకాదు.. తాప్సీ ఎంగేజ్‌మెంట్‌ను ఫిక్స్‌ చేయడం కోసమే ఆమె తల్లిదండ్రులు గోవా కూడా వెళ్లారనేది ఆ వార్త సారాంశం. అయితే ఈ విషయంపై తాప్సీ స్పందించారు.

‘‘నిజంగానా?.. నా నిశ్చితార్థానికి నన్ను కూడా కాస్త పిలవండి’’ అంటూ కాస్త కొంటెగా సమాధానం చెప్పారు. ఇంకా చెబుతూ–‘‘ మా తల్లిదండ్రులు గత పదేళ్లుగా గోవా వేళ్లలేదు. ఈ లెక్క ప్రకారం నాకు పదేళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగిందని మీరూ ఊహించుకోవచ్చేమో’’ అని ఘాటుగానే స్పందించారు. ఇక సినిమాల విషయానికోస్తే.. ఆమె నటిస్తోన్న హిందీ చిత్రాల్లో ‘బద్లా’ ఒకటి.  సుజోయ్‌ ఘోష్‌ దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్, తాప్సీ  నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement