
తాప్సీ
ఈ మధ్య తాప్సీకి ఒక అదృశ్య అతిథి పరిచయం అయ్యారట. ఎవ్వరికీ కనిపించరు. కేవలం తాప్సీకి మాత్రమే కనిపిస్తారట. ఏంటి.. బాయ్‌ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? అస్సలు కాదండి. ఈ అదృశ్య అతిథి కేవలం సినిమాలో పాత్ర మాత్రమే. స్పానిష్ మూవీ ‘కాంట్రాటింపో’(ఇంగ్లీష్ వెర్షన్‌లో ‘ది ఇన్‌విజిబుల్ గెస్ట్’) హిందీలోకి రాబోతోంది. ఈ స్పానిష్ థ్రిల్లర్‌ను బాలీవుడ్ దర్శకుడు సంజయ్ ఘోష్ హిందీలో రీమేక్ చేస్తున్నారు. తాప్సీ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాలో బిజినెస్‌మేన్‌గా అలీ ఫాజల్ కనిపించనున్నారు.
అమితాబ్ బచ్చన్ కూడా నటించనున్నారని టాక్. సో.. ఈ సినిమాలో తాప్సీ కోసం వచ్చే ఆ ‘అదృశ్య అతిథి’ ఎవరో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఒకటే షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. డెహ్రాడూన్‌లో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకోనుంది. ఈ సంగతి ఇలా ఉంచితే ఇండియన్ హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ జీవితం ఆధారంగా షాద్ అలీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర్మ’. దిల్జీత్ సింగ్, తాప్సీ నటించిన ఈ సినిమాను జూలై 13న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నారు తాప్సీ.
Comments
Please login to add a commentAdd a comment