
తాప్సీ
బోర్డ్ మీటింగ్‌లు, లాభనష్టాలు, కంపెనీ డెవలప్‌మెంట్ డిస్కషన్స్‌తో ప్రజెంట్ స్కాట్లాండ్‌లో బిజీగా ఉన్నారట హీరోయిన్ తాప్సీ. సుజోయ్‌ఘోష్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘బద్లా’. రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ‘పింక్’ సినిమా తర్వాత అమితాబ్, తాప్సీ కలిసి నటిస్తున్న ఈ సినిమా స్పానిష్ చిత్రం ‘ది ఇన్‌విజిబుల్ గెస్ట్’ చిత్రానికి రీమేక్. ప్రస్తుతం అమితాబ్, తాప్సీలపై స్కాట్లాండ్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
‘‘గత రెండు నెలలుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా. కానీ షార్ప్ అండ్ స్ట్రాంగ్ బిజినెస్ ఉమెన్ క్యారెక్టర్ చేయలేదు. ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్న క్యారెక్టర్ ఇదే. ఒకవేళ సినిమాలో నా క్యారెక్టర్ ఇంత స్ట్రాంగ్‌గా లేకపోతే సుజోయ్‌తో ఈ సినిమా చేయడం అన్ ఫెయిర్’’ అని పేర్కొన్నారు తాప్సీ. మరోవైపు ఆమె నటించిన హిందీ చిత్రాలు ‘సూర్మ’ వచ్చే నెల 13న, ‘ముల్క్’ చిత్రం ఆగస్టు 3న రిలీజ్ కానున్నాయి. అలాగే మరో రెండు బీ టౌన్ మూవీస్ ‘తడ్కా, మన్‌మర్జియాన్’లతో పాటు ఆమె తెలుగులో నటించిన ‘నీవెవరో’ సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.