
తాప్సీ
నేను కానీ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్‌లోకి దిగానంటే బాల్ బౌండరీ లైన్ దాటాల్సిందే... బౌలర్లకు, ఫీల్డర్స్‌కి ముచ్చెమటలు పట్టాల్సిందే.. కప్పు కొట్టాల్సిందే.. అంటున్నారు తాప్సీ. అదేంటీ.. తాప్సీ నటి కదా? క్రికెట్ గురించి మాట్లాడుతున్నారేంటి? సినిమాల నుంచి క్రికెట్ వైపు ఏమైనా అడుగులేస్తున్నారా? అనేగా మీ డౌట్. భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్‌లో తాప్సీ నటించనున్నారని బాలీవుడ్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి. ఆ మధ్య హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సూర్మ’ చిత్రంలో తాప్సీ హాకీ ప్లేయర్‌గా నటించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు క్రికెటర్‌గా కనిపించనున్నారామె. ఇండియాకి ఎన్నో విజయాలను సాధించి పెట్టిన మిథాలీ తన కెరీర్‌లో వన్డేల్లో 114 నాటౌట్‌గా, టెస్ట్ మ్యాచుల్లో 214 అత్యుత్తమ స్కోర్ సాధించారు. మరి సినిమాలో తాప్సీ... సెంచరీ కొడతారో? డబుల్ సెంచరీ కొడతారో చూడాల్సిందే. క్రికెటర్‌గా నటించడమంటే అంత సులువు కాదు. అందుకు ఎంతో ప్రాక్టీస్ ఉండాలి. అందుకే ఈ బ్యూటీ శిక్షణ తీసుకోనున్నారట. మిథాలీ బయోపిక్‌ను బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ వయాకామ్ 18 నిర్మించనుంది. చిత్రవర్గాలు తాప్సీని సంప్రదించగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ‘‘ఆల్రెడీ ఓ స్పోర్ట్స్ బయోపిక్‌లో చేశాను. మరో స్పోర్ట్స్ బయోపిక్ చేయాలని ఉంది. మిథాలీ పాత్ర చేయడానికి రెడీ’’ అన్నారట తాప్సీ.
Comments
Please login to add a commentAdd a comment