సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే ధ్యేయమని రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామయ్య వేణు తెలిపారు. రాజమహేంద్రవరం బలరామ కృష్ణరాజు నగర్‌లోని సంస్థ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన వెంచర్ చంద్రిక అవంతిక (ది ప్రిన్సెస్ ఆఫ్ రాజమహేంద్రవరం) వివరాలను వెల్లడించారు. రాజానగరం మండలం
-
‘రాకీ’ మేనేజింగ్ డైరెక్టర్ రామయ్య వేణు
-
నేడు చక్రద్వారబంధంలో భూమి పూజ
దానవాయిపేట (రాజమహేంద్రవరం) :
సామాన్య, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే ధ్యేయమని రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామయ్య వేణు తెలిపారు. రాజమహేంద్రవరం బలరామ కృష్ణరాజు నగర్‌లోని సంస్థ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన వెంచర్ చంద్రిక అవంతిక (ది ప్రిన్సెస్ ఆఫ్ రాజమహేంద్రవరం) వివరాలను వెల్లడించారు. రాజానగరం మండలం చక్రద్వారబంధంలోని జీఎస్‌ఎల్ ఆసుపత్రి వెనుక ఉన్న తొమ్మిది ఎకరాల పదిసెంట్లలో గంగ, గోదావరి, యమున, సరస్వతి, కృష్ణ, తుంగభద్ర, కావేరీ, నేత్రావతి, అర్కావతి, బ్రహ్మపుత్ర తదితర నదుల పేరులతో 11 బ్లాక్‌లుగా విభజించి, వాటిలో 480 ప్లాట్లు నిర్మిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన భూమిపూజ శనివారం అర్ధరాత్రి 3.38 నిమిషాలకు జరుగుతుందన్నారు. ఈ వెంచర్‌లో టూ బెడ్ రూమ్ ప్లాట్ రూ.16 లక్షలు, త్రీ బెడ్ రూమ్ ప్లాట్ రూ.22 లక్షలకు అందిస్తున్నట్లు తెలిపారు. వెంచర్ ప్రారంభించిన రెండు మాసాల వ్యవధిలో సుమారు 200 ప్లాట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయన్నారు. 22 ఏళ్ల అనుభవంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేస్తున్న ఈ వెంచర్‌లో సూపర్ మార్కెట్, పార్కు, ఆసుపత్రి, క్లబ్‌హౌస్, జీమ్, యోగా రూమ్, కాన్ఫరె¯Œ్సహాలు, స్విమ్మింగ్ ఫూల్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రెండేళ్లలో వెంచర్‌ను పూర్తిస్థాయిలో వినియోగదారులకు అందిస్తామన్నారు. అనంతరం చంద్రిక అవంతిక బ్రోచర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రామకృష్ణ, సుబ్బారావు, కోటేశ్వరరావు, కిరణ్, శ్యామ్, శేఖర్, స్వామి, శ్రీధర్, అకీర్, రాజు పాల్గొన్నారు.