కలవరమా? | Self Check Your Depressions | Sakshi
Sakshi News home page

కలవరమా?

Published Fri, Mar 16 2018 8:26 AM | Last Updated on Fri, Mar 16 2018 8:26 AM

Self Check Your Depressions - Sakshi

కలలు మీ గురించి చాలా విషయాలు చెబుతాయి తెలుసా? కలలు మనలో నిక్షిప్తమైన భావోద్వేగాల ఫలితం. మానసిక స్థితినే కాదు, చాలా సమస్యలకు పరిష్కారాలు చెబుతాయంటారు డ్రీమ్‌ ఎక్స్‌పర్ట్‌లు. కావాలంటే సెల్ఫ్‌ చెక్‌ చేసుకోండి.

1.    నాలో నిగూఢమైన భావోద్వేగాలను కలలు ప్రతిఫలిస్తాయని నేననుకుంటాను.
    ఎ. అవును     బి. కాదు
2.    నాకొచ్చే కలలు సాధారణంగా మంచిగా,  హాయిగా ఉంటాయి
    ఎ. అవును     బి. కాదు
3.    నా కలల్లో ఎక్కువ వివరాలుంటాయి. ఎన్నో రంగులు కనిపిస్తాయి
    ఎ. అవును     బి. కాదు
4.    ఒకే కల కొద్ది నెలల వ్యవధిలో మళ్లీమళ్లీ వస్తుంటుంది.
    ఎ. అవును     బి. కాదు
5. సాధారణంగా నాకు పీడకలలు వస్తుంటాయి. భయపెడుతుంటాయి. (ఏడాదిలో కనీసం నాలుగైదు సార్లు..)
    ఎ. అవును     బి. కాదు
6.    ఉదయం లేవగానే రాత్రి నాకొచ్చిన కలల గురించి ఆలోచిస్తుంటాను.
    ఎ. అవును     బి. కాదు
7.    నా కలలు ఎక్కువగా చీకటిగా, అస్పష్టంగా ఉంటాయి.
    ఎ. అవును     బి. కాదు
8. ఒక్కోసారి నాకు సెక్స్‌ గురించి కలలు   వస్తుంటాయి.
    ఎ. అవును     బి. కాదు
9.    దేవుళ్ళూ, ఏవో తెలియని దివ్యలోకాల గురించి కలలు వస్తుంటాయి.
    ఎ. అవును     బి. కాదు
10.    నాకొచ్చే కలలు తర్వాత పెద్దగా గుర్తుండవు.
    ఎ. అవును     బి. కాదు

మీ సమాధానాల్లో కి 8 పాయింట్లు వస్తే మీరు మీ కలలు ఇచ్చే సందేశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. స్థిరంగా, సంతృప్తిగా జీవనం సాగిస్తుంటారు. క్రియేటివ్‌గా ఉంటారు. మీకు సంబంధించిన అంశం గురించి మీ కలలు ఏవైనా సందేశాలు ఇస్తుండచ్చు. డ్రీమ్‌ డైరీలో వాటిని సమీక్షించుకోండి.

బి కి 8 పాయింట్లు వస్తే, కలల్ని మీరు పట్టించుకోరని అర్థం. మీరు ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని, ఆందోళన చెందుతున్నారనడానికి సూచన. తీరని కోరికలేవో ఉన్నాయని అర్థం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement