భారతీయుల సగటు నిద్ర ఎంతసేపంటే?
న్యూఢిల్లీ: భారతీయులు రాత్రి సగటున 6.55 గంటలే నిద్రపోతున్నారని, ప్రపంచంలో తక్కువగా నిద్రిస్తున్న వారిలో మనమూ ఉన్నామని ప్రముఖ ఫిట్‌నెస్ సంస్థ ఫిట్‌బిట్ చేసిన అధ్యయనంలో తేలింది. 18 దేశాల్లో ఈ సర్వే చేయగా జపాన్‌లో అత్యంత తక్కువగా ప్రజలు 6.35 గంటలే నిద్రిస్తున్నారని తెలిసింది.
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూకే ప్రజలు సగటున అత్యధికంగా వరసగా 7.25 గంటలు, 7.16 గంటలు, 7.15 గంటలు పడుకుంటున్నట్లు ఫిట్‌బిట్ పేర్కొంది. ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర కూడా మన ఆరోగ్యంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపింది.