నిద్ర మనకి విశ్రాంతిని ఇస్తుంది. అప్పుడప్పుడు ప్రశాంతతను కూడా ఇస్తుంది. అందుకే అంటారు కంటి నిండా కునుకు తీస్తే మనసు కాస్త కుదుటపడుతుందని. అయిఏత కాస్త డిఫరెంట్‌గా విద్యార్థులు కాస్లులో, ఉద్యోగులు ఆఫీసులో నిద్రపోతున్న వీడియోలను ఇటీవల సోషల్ మీడియాలో చూస్తునే ఉన్నాం. ఇవన్నీ చెప్పేందుకు సరదాగా ఉన్నప్పటికీ ఒక్కోసారి పని వేళలో నిద్రపోతే ఉన్న ఉద్యోగం ఊడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆఫీసు సమయాల్లో ఎంత నిద్ర వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ పని కానిస్తుంటారు. అయితే అలాంటి స్లీపీ ప్రజలకు ఓ శుభవార్త తీసుకొచ్చింది అమెరికాలోని ఓ పరుపుల కంపెనీ.
ఆఫీస్‌కు వచ్చి హ్యాపీగా పడుకుంటే చాలు అదిరిపోయే జీతంతో జాబ్ ఇస్తారట. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఆ కంపెనీకి కావాల్సింది ఇదే! వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌కు చెందిన మ్యాట్రెసెస్ కంపెనీ కాస్పర్ తమ ఉద్యోగ ప్రకటనలో.. కంటినిండా కునుకు తీసే అలవాటు మీకు ఉందా, అయితే అలాంటి వారికి ఆకర్షియనీయమైన జీతంతో కూడా జాబ్ ఇస్తామని తెలిపారు. పని వేళల్లో వీలైనంత సేపు నిద్రపోయే వాళ్లే తమకు కావాలని ఆ కంపెనీ పేర్కొంది.
జాబ్‌కు ఎంపికైన అభ్యర్థులు కంపెనీ సోషల్ మీడియా ద్వారా వారి నిద్ర అనుభవాలను పంచుకోవడం, ముచ్చటించడం లాంటివి చేయాలని పేర్కొన్నారు. వీటితో పాటు టిక్‌టాక్ తరహా కంటెంట్‌ను కూడా కాస్పర్ సోషల్ మీడియా చానల్స్‌లో పోస్ట్ చేయాలన్నారు. కనీసం 18 ఏళ్లు ఉండడంతో పాటు వారికి సోషల్ మీడియా కంటెంట్‌ను క్రియేట్ చేయడంలో ప్రావీణ్యం ఉండాలని ఆ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆగస్ట్ 11లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు బంపరాఫర్.. ఆగస్టు 31 వరకు మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment